Raksha Bandhan 2025 best wishes and wishes images
Raksha Bandhan 2025 : సహోదరి సహోదరులు తమ బంధాన్ని ప్రత్యేకంగా వ్యక్త పరిచే పండుగ, ఈ రాఖీ పండుగ. ఇదే పండుగను కొన్ని ప్రాంతాల్లో రక్షా బంధన్ అని కూడా పిలుస్తారు. బాషా ఏదైనా ఈ పండుగ భావం ఒక్కటే. తమ సహోదరి పట్ల తమ ప్రేమను బయటకు వ్యక్తపరిచి, ఎల్లవేళలా నీకు తోడుగా నేనున్నాను అని సోదరులు ఇచ్చే భరోసా మరియు ప్రేమకు ప్రతీక ఈ పండుగ. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ పండుగ మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియ చేస్తుంది. అంత ఉన్నతమైన ఈ పండుగకు మీ సోదరి మనసును హత్తుకునేలా పంప తగిన బెస్ట్ విషెస్, కోట్స్ మరియు ఇమేజస్ ప్రత్యేకంగా మీకోసం అందిస్తున్నాం.
ప్రపంచం మొత్తం ఏకమైనా నీకు అండగా నేనున్నాను సోదరి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.!
అన్నా చెల్లెలి అనుబంధం ఆ దేవుడు ఇచ్చిన వరం, ఈరోజు నీకు ఆ దేవుడు సుఖసంతోషాలు ఇవ్వాలని ఆశిస్తున్నాను, హ్యాపీ రాఖి.!
అమ్మ తర్వాత నాకు అమ్మగా మారిన అక్క, నేను ఈ జన్మంతా ఋణపడి ఉంటాను, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.!
నా చిట్టి చెల్లెలు ఈ రాఖీ పౌర్ణమి ఈరోజు ఎంతో సంతోషంగా గడపాలి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.!
నాన్న తర్వాత నాన్న స్థానంలో నిలబడి నా కోసం అన్ని చేసి పెట్టిన అన్నయ్య, మీకు నా రాఖీ పండుగ శుభాకాంక్షలు!
నా కంటే చిన్నవాడివైనా నీ పెద్ద మనసుతో ఎల్ల వేళలా తోడునీడగా నడిచావు, ఆ దేవుడు నువ్వు కోరుకునే అన్ని కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను, హ్యాపీ రాఖీ తమ్ముడు.!
నా కష్టసుఖాల్లో ఎప్పుడూ తోడుగా నిలిచిన నా ప్రాణమైన అన్నయ్యకు రాఖీ పండుగ శుభాకాంక్షలు.!
నీకు కష్టమొస్తే నేనున్నానని ఎన్నడూ మరువకు చెల్లీ, నీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.!
ఈ జన్మంతా నీ కోసమే అర్పిస్తాను అక్క, నీ కష్టంలో నన్ను మరవకు, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.!
మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే చెల్లి గా పుట్టాలని కోరుకుంటాను, రాఖీ పండుగ శుభాకాంక్షలు.!