రాదేశ్యామ్ OTT లో రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే..!!

Updated on 16-Mar-2022

మార్చి 11న థియేటర్లలో విడుదలైన రాధే-శ్యామ్‌కి మిశ్రమ స్పందన వస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ను యాక్షన్ కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ చేరుకోలేదని రివ్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ సినిమా విజువల్స్ మరియు టేకింగ్ అద్భుతంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ సినిమా అంచనాలు  మేరకు చేరుకో లేక పోవచ్చని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

అయితే, 1960 ల నాటి జీవనశైలితో కూడిన క్లాసీ ప్రేమను కళ్ళకు కట్టినట్లు అద్భుతంగా చూపించినట్లు ఎక్కువగా వినిపిస్తోంది. బిగ్ స్క్రీన్స్ పైన విజువల్ వండర్ గా నిలిచిన రాధేశ్యామ్ OTT రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకునట్లు వార్తలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికి వరకూ ఈ రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు.

 

కానీ, ప్రస్తుతం నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్న రూమర్లు మరియు వార్తలు నిజమైతే మాత్రం రాధేశ్యామ్ సినిమా ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 2 న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అయితే, ఏ సినిమా అయినా సినిమా థియేటర్లలో రిలీజైన 4 వారాల తరువాతే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో వస్తుంది. ఆ విధంగా చూస్తే ఈ ప్రేక్షకుల రాధేశ్యామ్ OTT రిలీజ్  కి మరొక 10 రోజులు ఆలశ్యం కావచ్చు. ఏది ఏమైనా అధికారిక ప్రకటన వచ్చే వరకూ అన్ని వార్తలు కూడా అంచనా వేసి చెప్పినవే కావచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :