రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రభాస్ లేటెస్ట్ విజువల్ వండర్ మూవీ 'రాధే శ్యామ్' OTT లో స్ట్రీమ్ కానుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కాబోతోంది. ఈ సినిమా ఏప్రిల్ 1 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అంటే, రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా ఈ సినిమా OTT రిలీజ్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ మరియు ఉగాది కానుకే అవుతుంది. రాధే శ్యామ్ సినిమా ప్రైమ్ వీడియో లో తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో స్ట్రీమ్ అవుతుంది.
https://twitter.com/PrimeVideoIN/status/1508360798342508544?ref_src=twsrc%5Etfw
రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11న థియేటర్లలో విడుదలయ్యింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే మరియు భాగ్యశ్రీ కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించారు మరియు ఈ చిత్రానికి కె.కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1970 ల కాలం నాటి యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామా చిత్రం. అలాగే, ఈ సినిమాలో విజువల్స్ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయని కితాబు అందుకున్నారు.