రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ వారాంతం ముగిసిన తరువాత సోమవారం కలెక్షన్లలో మంచి పతనాన్ని చవిచూసింది. చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా కూడా త్వరలో వస్తుండడం కూడా ఈ సినిమా పైన ప్రభావం చూపిస్తోందని చెప్పవచ్చు. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల RRR మూవీ వచ్చే వారాంతంలో అంటే మార్చి 25న వెండితెరపై విడుదల కానుండగా వచ్చే వారం నాటికి రాధేశ్యామ్ సినిమా థియేటర్స్ నుండి తన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఇక OTT రిలీజ్ గురించి మాట్లాడితే, రాధే శ్యామ్ యొక్క OTT విడుదల తేదీ కూడా త్వరలోనే రాబోతుంది.
కొత్త సమాచారం ప్రకారం, రాధేశ్యామ్ సినిమాని OTT స్ట్రీమింగ్ భాగస్వామి అయిన Amazon Prime వీడియోలో తీసుకురావచ్చు. మొదట్లోనే థియేటర్‌లలో విడుదలైన 4 వారాల తర్వాత సినిమా OTT విడుదలను తీసుకువస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీని ప్రకారం ఈ సినిమా మార్చి 11న థియేటర్లలో విడుదలైంది కాబట్టి అప్పటి నుండి 4 వారాల తర్వాత అంటే ఏప్రిల్ 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో చిత్రాన్ని తీసుకురావచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఆదిలో మంచి వసూళ్లనే సాధించింది. వాస్తవానికి, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి మిశ్రమ రివ్యూలు వస్తున్నాయి. ఈ మూవీ మొదటి వారాంతం ముగిసే సరికి ఈ సినిమా 151 కోట్లు వసూలు చేసింది. అయితే, ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా విజయం సాధించలేదు. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ప్రకారం, ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద కేవలం 14 కోట్ల రూపాయల బిజినెస్ మాత్రమే చేసింది. ఇక 5 వ రోజు వరకు మొత్తం కలెక్షన్లు చూస్తే, రాధేశ్యామ్ సినిమా నిన్నటి వరకూ మొత్తం 165 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.