రాధేశ్యామ్ రిలీజ్ ట్రైలర్ ఒక రేంజ్ లో ఉందిగా..!!

Updated on 22-Mar-2022
HIGHLIGHTS

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

'రాధేశ్యామ్' రిలీజ్ డేట్ అనౌన్స్

రిలీజ్ ట్రైలర్ లో మాత్రం యాక్షన్ సీన్స్ కూడా ఒక రేంజ్ ఉన్నట్లు ఫీల్ అయ్యేలా చేసింది

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందించారు. చాలా కాలంగా అభిమానులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న 'రాధేశ్యామ్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు మరియు రిలీజ్ ట్రైలర్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే సినిమా హాల్స్ లో కొత్త సినిమాల సందడి మొదలయ్యింది. మహమ్మారి కారణంగా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ డేట్ లను మార్చుకోవాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు ఒక్కొక్కటిగా సినిమాలు రిలీజ్ కు సిద్దామవుతున్నాయి.

రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే మరియు భాగ్యశ్రీ కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించారు మరియు ఈ చిత్రానికి కె.కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1970ల నాటి యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామా చిత్రం. అలాగే, ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్స్ ద్వారా ఇది ఒక రొమాంటిక్ సినిమాగానే కనిపించినా లేటెస్ట్ గా వచ్చిన రిలీజ్ ట్రైలర్ తో ఈ సినిమా మీద అందరి ఊహలు తల్లకిందులయ్యాయని చెప్పొచ్చు.

ఎందుకంటే, ముందుగా వచ్చిన ట్రైలర్స్ అన్ని కూడా ప్రేమ మరియు రోమాన్స్ నే ఎక్కువగా వున్నట్లుగా చూపించాయి. అయితే, రిలీజ్ ట్రైలర్ లో మాత్రం యాక్షన్ సీన్స్ కూడా ఒక రేంజ్ ఉన్నట్లు ఫీల్ అయ్యేలా చేసింది. ఈ సినిమాలో డైలాగులు కూడా ఘాటుగానే ఉన్నట్లు ఈ ట్రైలర్ ద్వారా అర్ధమవుతోంది.  ఈ ట్రైలర్ ద్వారా అభిమానులకు మరియు ప్రేక్షకులకు రాధే శ్యామ్ సినిమా పైన అంచనాలు మరింతగా పెంచేలా చేసిందని చెప్పొచ్చు. ట్రైలర్ లో చూపించిన షిప్ మునిగే సీన్ గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :