BGMI lite (పబ్ జి లైట్) వెర్షన్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే.!

Updated on 22-Jun-2022
HIGHLIGHTS

BGMI lite ను ఇండియాలో లాంచ్ అవుతోంది

BGMI లైట్ వెర్షన్ ను కూడా లాంచ్ చెయ్యాలని క్రాఫ్ టాన్ చూస్తోంది

లైట్ వెర్షన్ ను తీసుకురావడానికి పూర్తి స్థాయిలో సిద్ధమయినట్లు కనబడుతోంది

karfaton సంస్థ ఇండియాలో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా యొక్క లైట్ వెర్షన్ BGMI lite ను ఇండియాలో తెలుసుకొచ్చేందుకు సన్నద్ధమయ్యింది. ఇండియాలో బ్యాన్ అవ్వకముందు PubG మరియు PubG Lite రెండు వెర్షన్లు కూడా అత్యంత పాపులర్ గేమ్స్ గా నిలిచాయి. అయితే, ఇండియా బ్యాన్ తరువాత బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (BGMI) పేరుతో ఇండియన్ వెర్షన్ ను తీసుకొచ్చింది. అయితే, ఈ గేమ్ కు టెక్ పరిధి వున్నది కాబట్టి ఇప్పుడు లైట్ వెర్షన్ ను కూడా ఇండియాలో లాంచ్ చెయ్యాలని క్రాఫ్ టాన్ చూస్తోంది.

ఈ BGMI lite దాదాపుగా పబ్ జి లైట్ మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ నెల చివరికల్లా ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా లైట్ వెర్షన్ లాంచ్ కావచ్చని కూడా నివేదికలు సూచిస్తున్నాయి. దీనికోసం, కంపెనీ BGMI lite కోసం ఎంతమంది ఆసక్తి కనబరుస్తున్నారో తెలుసుకోవడానికి ఒక ఎగ్జిట్ పోల్ సర్వ్ ని కూడా నిర్వహించింది. దీని తరువాతే కంపెనీ ఈ లైట్ వెర్షన్ ను తీసుకురావడానికి పూర్తి స్థాయిలో సిద్ధమయినట్లు కనబడుతోంది.

వాస్తవానికి, బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(BGMI) గేమ్ ను ఆడాలంటే హై ఎండ్ స్మార్ట్ ఫోన్ అవసరం అవుతుంది. అందుకే, ఈ గేమ్ కొన్ని స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఆడడానికి వీలవుతుంది. అయితే, లైట్ వెర్షన్ తీసుకువస్తోంది మరియు దీని ద్వారా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో కూడా ఈ గేమ్ ఆడేందుకు అనుకూలిస్తుంది. అందుకే, karfaton తీసుకువచ్చిన PubG Mobile Lite మాదిరిగానే BGMI lite ను కూడా ఇండియాలో తీసుకురావడానికి తొందరపడుతోంది. అత్యధికంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు కలిగిన భారతదేశంలో తన పరిధిని పెంచుకోలేని ఎవరు మాత్రం అనుకోరు చెప్పండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :