అందరికీ తెలిసినట్లుగా, భారత ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం 117 ఇతర యాప్స్ తో పాటు PUBG మొబైల్ ను నిషేధించింది. అయితే, ఈ గేమ్ అప్పటికే 18 కోట్ల ఇన్ స్టాల్ మరియు లాగిన్ కలిగి వుంది. ఈ PUBG మొబైల్ గేమ్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బాటిల్ రాయల్ గేమ్స్ లో ఒకటి. ముఖ్యంగా మన దేశంలో, ప్రపంచంలోనే అత్యధిక డౌన్ లోడ్స్ ఉన్నాయి. కానీ, మన దేశంలో దీని పైన నిషేడం తరువాత దీని ఖ్యాతి అమాంతంగా కుప్పకూలిపోయింది. కానీ, ఇప్పుడు ఈ గేమ్ కొత్త మలుపు తీసుకుంటోంది. ఈ సంఘటన తరువాత, PUBG Corp (దక్షిణ కొరియా సంస్థ) ఒక ప్రకటనను విడుదల చేసింది, ఇది భారతదేశంలో నిషేధాన్ని పూర్తిగా పాటించాలని భావిస్తోంది మరియు ఈ చర్యలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకున్నట్లు తేలింది.
అందుకే, ఈ విషయాన్నిదృష్టిలో పెట్టుకుని, చైనా సంస్థ అయినటువంటి Tencent తో సంబంధాలను తగ్గించుకోవాలని, Tencent ను భారతదేశంలో PUBG మొబైల్ ను నడపడానికి అనుమతించే లైసెన్స్ ను రద్దు చేయాలని PUBG కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ కొరియా సంస్థ, చైనాకి చెందిన Tencent నుండి దూరం కావాలని కోరుకుంటుంది. వాస్తవానికి, నిషేధం ప్రకటించిన వెంటనే, Tencent దాదాపు 34 బిలియన్స్ కోల్పోయింది మరియు దాని వాటా విలువ 2% తగ్గింది.
PUBG Corp భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మరియు వారు నిర్దేశించిన నిబంధనలను పాటించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రకటన ఇలా చెబుతోంది, “ప్లేయర్ డేటా యొక్క ప్రైవసీ మరియు భద్రత కోసం సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తున్నందున ప్రభుత్వం తీసుకున్న చర్యలను PUBG కార్పొరేషన్ పూర్తిగా అర్థం చేసుకుంటుంది మరియు గౌరవిస్తుంది. భారతీయ చట్టాలు మరియు నిబంధనలను పూర్తిగా పాటించేటప్పుడు గేమర్స్ మరోసారి యుద్ధభూమిలో పడటానికి వీలు కల్పించే ఒక పరిష్కారాన్ని కనుగొనటానికి భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఇది భావిస్తోంది. ”