OTT Release: ఈరోజు నుండి మొదలైన premalu మరియు Gaami స్ట్రీమింగ్.!

HIGHLIGHTS

ఈ వారం రెండు బ్లాక్ బస్టర్ మూవీలు ఓటీటీ లో రిలీజ్ అయ్యాయి

విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ Gaami స్ట్రీమ్ అవుతోంది

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ premalu స్ట్రీమ్ అవుతోంది

OTT Release: వీకెండ్ వచ్చిందంటే చాలు ఆన్లైన్లో రిలీజ్ కాబోతున్న సినిమాల గురించి వెతుకులాట మొదలవుతుంది. కొత్త సినిమాలు ఏ యి లో విడుదల అవుతున్నా, ఈ సినిమాని చూడాలి అని కుతూహలం కలుగుతుంది. ఈ వారం రెండు బ్లాక్ బస్టర్ మూవీలు ఓటీటీ లో రిలీజ్ అయ్యాయి. ఒకటి నేరుగా వచ్చిన తెలుగు సినిమా అయితే, రెండవది మలయాళం నుంచి డబ్బింగ్ చేయబడిన డబ్బింగ్ మూవీ.

Gaam

Gaami OTT Release

చిన్న బడ్జెట్ చిత్రాలతో పెద్ద హిట్స్ ఇచ్చిన విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ‘గామీ’ ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అయ్యి స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా Zee5 నుండి తెలుగు, కన్నడ మరియు తమిళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. అఘోరాగా విశ్వక్ సేన్ అద్భుతమైన నటన ఈ సినిమాలో హైలెట్ అని గొప్ప రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాని జీ5 లో చూడవచ్చు.

Premalu

Premalu OTT Release

మలయాళ చిత్ర సీమనుండి వచ్చి తెలుగు బెల్ట్ లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచిన ‘ప్రేమలు’ సినిమా కూడా ఈరోజు ఓటీటీ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా AHA నుండి స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా కేవలం తెలుగు రీజియన్ లోనే 15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ను సాధించింది. ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ మరియు ఇందులో నస్లేన్ కె గఫూర్ కథా నాయకుడిగా, మమితా బైజు కథా నాయకిగా నటించారు.

Also Read: భారత WhatsApp యూజర్లకు Meta AI ఫీచర్ వచ్చేసింది.. చెక్ చెశారా.!

More OTT Release:

వీటితో పాటుగా మరొక లేటెస్ట్ చిత్రం కూడా ఓటీటీ లో రిలీజ్ అయ్యింది. అదే లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓం భీమ్ బుష్’ మూవీ.

ఓం భీమ్ బుష్

సహజమైన నటనతో అందరికి సుపరిచితమైన శ్రీవిష్ణు లేటెస్ట్ చిత్రం ‘ఓం భీమ్ బుష్’ కూడా ఇప్పుడు స్ట్రీమ్ అవుతోంది. ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ లతో అద్భుతమైన కామెడీని పండించిన ఈ సినిమా కూడా అమేజాన్ ప్రైమ్ వీడియో నుండి స్ట్రీమ్ అవుతోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :