Poco X4 Pro: ఆకట్టుకునే ధరలో ఆకర్షనీయమైన ఫీచర్లతో వచ్చింది..!!

Updated on 28-Mar-2022
HIGHLIGHTS

Poco X4 Pro స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది

67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ

స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్

Poco X4 Pro స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. వాస్తవానికి, ఈ  స్మార్ట్ ఫోన్ ను WMC 2022 నుండి కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఇండియాలో ఈరోజు విడుదల చెయ్యబడింది. పోకో ఎక్స్4 ప్రో స్మార్ట్ ఫోన్ వేగవంతమైన 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ మరియు స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది. మార్కెట్లోకి లేటెస్టుగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ పూర్తి విశేషాలను తెలుసుకుందామా.

Poco X4 Pro: ధర మరియు సేల్

పోకో ఎక్స్4 ప్రో స్మార్ట్ ఫోన్ ముదురు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలను క్రింద చూడవచ్చు.

1. 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : ధర రూ.18,999

2. 6GB ర్యామ్ + 12GB స్టోరేజ్ : ధర రూ.19,999

3. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : ధర రూ.21,999

ఏప్రిల్ 15 మధ్యాహ్నం 12 గంటల నుండి Flipakrt లో లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ పైన లిమిటెడ్ పిరియడ్ లాంచ్ అఫర్ కూడా వుంది. HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ మరియు EMI అప్షన్ తో ఈ ఫోన్ కొనేవారికి 1000 తగ్గింపు లభిస్తుంది.

Poco X4 Pro: స్పెక్స్

పోకో X4 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.7-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగివుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ లో సెంట్రల్ కటౌట్ ఉంది. ఇందులో 16ఎంపి సెల్ఫీ కెమెరాను కలిగి వుంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ సేఫ్టీతో వస్తుంది మరియు  1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 64MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రావైడ్ స్నాపర్ మరియు 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoCతో పాటు గరిష్టంగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే, ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 13 పైన రన్ అవుతుంది మరియు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి ఉండడమే కాకుండా IP53 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగివుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :