ఈరోజు పోకో తన POCO M4 Pro యొక్క 4G వెర్షన్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఫిబ్రవరి 15న POCO M4 Pro 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన పోకో ఇప్పుడు 4G ఫోన్ ను కూడా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కూడా ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకువచ్చింది. బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్ట్ పరంగా ఒకేవిధంగా ఈ ఎం4 ప్రో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. మరి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలను గురించి తెలుసుకుందామా.
POCO M4 Pro 4G వెర్షన్ ను కూడా మూడు వేరియంట్ లలో విడుదల చేసింది. వీటిలో బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో కేవలం రూ. 14,999 ధరతో వచ్చింది. రెండవ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ. 16,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ. 17,999 ధరతో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ కూల్ బ్లూ, పవర్ బ్లాక్ మరియు ఎల్లో మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ మార్చ్ 7న Flipkart నుండి జరగనుంది.
ఈ POCO M4 Pro 4G ఫోన్ 6.4 అంగుళాల FHD+ AMOLED పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఇది DCI-P3 సపోర్ట్ డిస్ప్లేతో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2.05 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ ప్రాసెసర్. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS ఆధారితమైన MIUI 13 స్కిన్ పైన నడుస్తుంది.
పోకో ఎం4 ప్రో 4G వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 64ఎంపి ప్రధాన కెమెరాకి జతగా 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఇచ్చింది. ముందుభాగంలో, 16ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.
పోకో ఎం4 ప్రో స్మార్ట్ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను సైడ్ లో ఇచ్చింది మరియు AI ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది. ఇందులో డ్యూయల్ స్పీకర్లు కూడా అందించింది.
ఇలాంటి వార్తలు, రివ్యూలు, ఫీచర్ స్టోరీలు, బైయింగ్ గైడ్‌లు మరియు టెక్నాలజీ సంబంధిత పూర్తి సమాచారం కోసం Digit ని అనుసరించండి.