perplexity ai launches Comet AI browser
Chat GPT మరియు Gemini AI లకు పోటీగా వచ్చిన perplexity ai ఇప్పుడు ఇండియాలో తన కొత్త Comet AI బ్రౌజర్ లాంచ్ చేసింది. ఈ కొత్త బ్రౌజర్ పూర్తిగా ఎఐ సపోర్ట్ తో ఉంటుంది మరియు ఒక AI పర్సనల్ అసిస్టెంట్ మాదిరిగా పని చేస్తుంది. ఇది సంప్రదాయ వెబ్ బ్రౌజర్ మాదిరిగా కాకుండా మీకు సరికొత్త ఫీల్ మరియు ఫీచర్స్ ఆఫర్ చేసుంది. ఈ లేటెస్ట్ వెబ్ బ్రౌజర్ ఫీచర్స్ మరియు ఇతర వివరాలు తెలుసుకుందామా.
కమెట్ ఏఐ బ్రౌజర్ సెప్టెంబర్ 22న అఫీషియల్ గా ఇండియాలో అడుగుపెట్టింది. ఈ కమెట్ ఏఐ బ్రౌజర్ ముందుగా పెర్ప్లేక్సిటీ ప్రో యూజర్లకు భారత్ లో ఆఫర్ చేస్తోంది. కమెట్ ఏఐ బ్రౌజర్ ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం ప్రీ రిజిస్ట్రేషన్ కోసం లిస్ట్ అయ్యింది. అయితే, ఈ యాప్ ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందో ఇంకా క్లియర్ డేట్ అనౌన్స్ చేయలేదు. అలాగే, iOS లో ఇది ఎప్పటి వరకు వస్తుందో కూడా క్లారిటీ ఇవ్వలేదు.
ఇది కమెట్ అసిస్టెంట్ సైడ్ బార్ తో వస్తుంది మరియు ఇది ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను మరింత సరళం చేసే విధంగా ఉంటుంది. ఇది మల్టీ టాస్కింగ్ మరియు మరిన్ని పనులను చాలా సులభం చేస్తుంది. ఇది మీరు ఇప్పటివరకు చూసిన మరియు వినియోగించిన సమాచారం ప్రకారం సంబంధిత విషయాలు సూచిస్తుంది.
PDF పేజీలు విశ్లేషించడం మొదలుకొని వెబ్ పేజీల సమరీ వరకు అన్ని పనులు సింపుల్ చేస్తుంది. ముఖ్యంగా, కమెట్ ఏఐ బ్రౌజర్ యూజర్ ప్రైవసీ పై ఎక్కువ ద్రుష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇది బ్రౌజింగ్ డేటాని విండోస్ / Mac తో లోకల్ గా స్టోర్ చేస్తుంది మరియు ప్రత్యేకమైన ప్రైవసీ సెట్టింగ్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Amazon Sale ఆఫర్ చేస్తున్న బెస్ట్ Earbuds డీల్స్ పై ఒక లుక్కేయండి.!
కమెట్ ఏఐ బ్రౌజర్ ప్రస్తుతానికి కేవలం ప్రో యూజర్లకు మాత్రమే మాత్రమే అందుబాటులో ఉంది. ఉచిత సభ్యులు ఈ కమెట్ ఏఐ బ్రౌజర్ ను ఉపయోగించలేరు. ఈ బ్రౌజర్ కోసం Perplexity Pro subscription కలిగి ఉండాలి. ఇది ఇప్పుడు కొన్ని షరతులతో కూడిన యాక్సెస్ ను ఎయిర్టెల్ యూజర్లకు అందించింది. అయితే, ఈ బ్రౌజర్ వారికి వర్తిస్తోందో లేదో అఫీషియల్ గా ప్రకటించలేదు.