Chat GPT ని వెనక్కి నెట్టి నెంబర్ 1 ప్లేస్ దక్కించుకున్న Perplexity AI

Updated on 18-Jul-2025
HIGHLIGHTS

ఇప్పటి వరకు Chat GPT మాత్రమే ఎక్కువ డౌన్లోడ్స్ సాధించిన AI యాప్ గా వెలుగొందుతోంది

పెర్ప్లేక్సిటీ భారీగా డౌన్లోడ్స్ సాధించి చాట్ జిపిటి ని సైతం వెనక్కి నెట్టింది.

పెర్ప్లేక్సిటీ నెంబర్ వన్ ఎఐ యాప్ గా లిస్ట్ అయ్యింది

Perplexity AI: దేశంలో ఇప్పటి వరకు Chat GPT మాత్రమే ఎక్కువ డౌన్లోడ్స్ సాధించిన AI యాప్ గా వెలుగొందుతోంది. అయితే, ఎఐ వరల్డ్ లోకి కొత్తగా వచ్చిన ఇప్పుడు కొత్త సెన్సేషన్ గా అవతరించింది. మొన్నటి వరకు యాపిల్ యాప్ స్టోర్ లో చాట్ జిపిటి మాత్రమే అత్యధిక డౌన్లోడ్స్ సాధించిన ఎఐ యాప్ గా ఉండగా, నిన్న ఎయిర్టెల్ ప్రకటించిన ఉచిత పెర్ప్లెక్సిటీ ప్రో సర్వీస్ ఆఫర్ తర్వాత యాపిల్ స్టోర్ లో భారీగా డౌన్లోడ్స్ సాధించి చాట్ జిపిటి ని సైతం వెనక్కి నెట్టింది.

Chat GPT vs Perplexity AI

యాపిల్ ప్లే స్టోర్ లో మొన్నటి వరకు టాప్ ఎఐ యాప్ గా చాట్ జిపిటి పోటీ అనేది లేకుండా ఏకధాటిగా కొనసాగింది. అయితే, అతిపెద్ద ప్రైవేట్ టెలికాం ఎయిర్టెల్ నిన్న ప్రకటించిన కొత్త ఆఫర్ తో జిపిటి ని వెనక్కి నెట్టి ఆ స్థానంలో పెర్ప్లెక్సిటీ వచ్చి కూర్చుంది. ఈ విషయంలో పెర్ప్లెక్సిటీ భారతీ ఎయిర్టెల్ కు రుణపడి ఉంటుంది.

ఇప్పుడు యాపిల్ యాప్ స్టోర్ లో పెర్ప్లెక్సిటీ నెంబర్ వన్ ఎఐ యాప్ గా లిస్ట్ అయ్యింది. అలాగే, చాట్ జిపిటి ఒక మెట్టు క్రిందకు దిగి రెండో స్థానంలోకి చేరుకుంది. ఇది ప్రో సర్వీస్ కావడంతో మరింత వేగం మరియు అధిక యాక్సెస్ లభించడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ఏమిటా ఎయిర్టెల్ ఆఫర్?

దేశంలో ఉన్న 36 కోట్ల మంది యూజర్లకు కొత్త ఎఐ యాప్ మరియు సర్వీస్ కోసం ఉచిత యాక్సెస్ అందిస్తున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. కేవలం ప్రకటన మాత్రమే కాదు ఎయిర్టెల్ యొక్క యూజర్లకు నిజంగానే ఈ సర్వీస్ ను ఉచితంగా అందించింది. వాస్తవానికి, గ్లోబల్ మార్కెట్లో ఈ సర్వీస్ కోసం రూ. 17,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. కానీ, ఎయిర్టెల్ మరియు పెర్ప్లేక్సిటీ కుదుర్చుకున్న ఒప్పందం తో ఈ సర్వీస్ ను ఎయిర్టెల్ యూజర్లు అందరికీ ఉచితంగా అందించింది.

ఎయిర్టెల్ యూజర్లు ఈ ఎఐ ఉచిత సర్వీస్ కోసం Airtel Thanks App నుంచి Ai నోటిఫికేషన్ అందుకునే ఉంటారు. దీని ద్వారా ఏ సర్వీస్ ఉచితంగా లాగిన్ చేసుకోవాలి. ఒకవేళ అలా జరగని పక్షంలో యాప్ లోని రివార్డ్స్ అండ్ OTTs ట్యాగ్ లోకి వెళ్ళి ఈ కొత్త సర్వీస్ రివార్డ్ పై క్లిక్ చేసి Pro సర్వీస్ ను ఉచితంగా పొందవచ్చు.

Also Read: Sony 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ నుంచి బిగ్ డిస్కౌంట్ తో లభిస్తోంది.!

మొత్తానికి, ఇండియాలో ఉచిత AI సర్వీస్ లను ఉచితంగా అందించిన టెలికాం కంపెనీ గ ఎయిర్టెల్ నిలవగా, యాపిల్ యాప్ స్టోర్ లో నెంబర్ యాప్ గా పెర్ప్లెక్సిటీ నిలిచింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే బహుశా ఇదే కాబోలు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :