Paytm Postpaid తో 1 లక్ష వరకూ క్రెడిట్ వాడుకొని తరువాత తిరిగి చెల్లించవచ్చు

Updated on 09-Jun-2020
HIGHLIGHTS

ముందుగా నగదు వాడుకొని తరువాత చెల్లించే విధంగా Paytm తీసుకొచ్చిన క్రెడిట్ అఫర్ Paytm Postpaid సర్వీసు

Paytm Postpaid సర్వీసును ఆఫ్‌లైన్ రిటైలర్ అవుట్‌లెట్‌లు మరియు కిరాణా షాపులకు కూడా విస్తరించిం

ఈ సర్వీస్ Paytm మాల్‌ ద్వారా కొనుగోళ్లను చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, Paytm , PhonePay , Google Pay  వంటి సంస్థలు కూడా ప్రజల సౌలభ్యం కోసం అనేక చర్యలు తీసుకున్నాయి.

ముందుగా నగదు వాడుకొని తరువాత చెల్లించే విధంగా Paytm తీసుకొచ్చిన క్రెడిట్ అఫర్ Paytm Postpaid  సర్వీసును ఆఫ్‌లైన్ రిటైలర్ అవుట్‌లెట్‌లు మరియు కిరాణా షాపులకు కూడా విస్తరించింది. ఈ సౌకర్యంతో ప్రజలు, కిరాణా, పాలు మరియు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఈ సర్వీస్ సమీపంలోని దుకాణాలతో పాటు Reliance Fresh , Haldiram , Apollo Pharmacy  మొదలైన వాటిలో కూడా పని చేస్తుంది.

ఈ సర్వీస్ Paytm మాల్‌ ద్వారా కొనుగోళ్లను చేయడానికి అందుబాటులో ఉంటుంది. Dominos , Tata Sky , Pepper Fry , Spencer's , Hunger Box , Pantajali  వంటి వాటికీ ఆన్‌లైన్ ప్రెమెంట్స్ కోసం కూడా మీరు ఈ సర్వీస్ ను ఉపయోగించవచ్చు.

Paytm Postpaid యొక్క ప్రత్యేక ఫీచర్లు

  • Paytm తన పోస్ట్‌పెయిడ్ యొక్క క్రెడిట్ పరిమితిని  గరిష్టంగా 1,00,000 కు పెంచింది. ఇంతకు ముందు ఈ పరిమితి 60,000 వరకూ మాత్రమే ఉంది మరియు ఈ పరిమితి కొన్ని లిమిటెడ్ ప్రోడక్ట్స్ కొనుగోళ్లకు మాత్రమే పరిమితం చేసింది.
  • Paytm Postpaid లో ఇప్పుడు Lite , Delite  మరియు Elite అనే మూడు మూడు కొత్త అప్డేటెడ్ ఫీచర్లను ఉంచింది. ఇందులో, Lite యొక్క క్రెడిట్ పరిమితిని రూ .20,000 వద్ద ఉంచారు. Delite మరియు Elite  వేరియంట్స్ క్రెడిట్ లిమిట్ ని రూ .20,000 నుండి రూ .1,00,000 కు పెంచారు. ఇందులో ఎటువంటి ఇతర  ఛార్జ్ కూడా లేదు.
  • ఈ Paytm Postpaid సర్వీస్ ను ఉపయోగించడానికి వినియోగదారులు భాగస్వామి NBFC తో KYC ని పూర్తి చేయాలి.
  • ప్రతి నెలా 7 న బిల్లు చెల్లింపు సమర్పించాలి. వినియోగదారులు వారి Paytm Postpaid పాస్‌బుక్ ‌పైన ఎల్లప్పుడూ నిఘా ఉంచాలి, తద్వారా వారి నెలవారీ ఖర్చుల గురించి వారికి పూర్తిగా తెలుసుకునే వీలుంటుంది.
  • Paytm పోస్ట్‌పెయిడ్ సౌకర్యం చాలా మంది యాక్టివ్ యుజర్లకు విస్తరించబడింది. మీరు Paytm Postpaid అకౌంట్ ను ఉపయోగించాలనుకుంటే, మీరు మీ పేయిమెంట్స్ కోసం ఎక్కువగా Paytm ను ఉపయోగించాలి.

Paytm Postpaid అంటే ఏమిటి?

Paytm తన Postpaid ఫీచర్‌తో వినియోగదారులకు Digital Credit ‌ను అందిస్తుంది. ఈ లక్షణంతో, వినియోగదారులు వారి ముఖ్యమైన వస్తువుల కొనుగోలు కోసం చెల్లించవచ్చు మరియు తరువాతి నెల 7 వ తేదీకి ముందు ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఇది ఎటువంటి వ్రాతపని లేదా పత్రాలు అవసరం లేని అతిసాధారణ సర్వీస్.

Paytm Postpaid ను ఎలా ఉపయోగించాలి?

  • Paytm పోస్ట్‌పెయిడ్ కోసం మీ Paytm Account కు లాగిన్ అవ్వండి.
  • లాగిన్ అయిన తరువాత, Paytm Postpaid కోసం search చెయ్యండి.
  • బ్యానర్‌కు వెళ్లి, MyPostpaid Account ను ఎనేబుల్ చేయండి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇది మీ క్రెడిట్ పరిమితిని సూచిస్తుంది.
  • Paytm పోస్ట్‌పెయిడ్ ప్రారంభించడానికి పాస్‌కోడ్‌ను రూపొందించండి.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :