Good News: ఉచితంగా LPG గ్యాస్ సిలిండర్

Updated on 15-Jun-2021
HIGHLIGHTS

గ్యాస్ సిలిండర్ వినియోగధారులకు గుడ్ న్యూస్

ఉచితంగా LPG గ్యాస్ సిలిండర్

HP, Indane లేదా Bharat ఏదైనా సరే ఉచితం

మీరు వాడుకునే గ్యాస్ సిలిండర్ HP, Indane లేదా Bharat ఏదైనా సరే ఉచితం పొందే గొప్ప సదవకాశం. గ్యాస్ సిలిండర్ ధర రోజూ పెరిగి పోతుంటే, ఈ ఉచిత ఆఫర్ మీ కోసమే ఎదురు చూస్తోంది. మీ గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేనప్పటికీ  Paytm మాత్రం తన కస్టమర్లకు ఈ గోల్డెన్ ఛాన్స్ ప్రకటించింది. గ్యాస్ సిలిండర్ వినియోగధారులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.  

Paytm క్యాష్ బ్యాక్ అఫర్ ద్వారా తన యూజర్ల కోసం గ్యాస్ సిలిండర్ బుకింగ్ పైన భారీ క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తోంది. ఈ అఫర్ ద్వారా దాదాపుగా రూ. 800 రూపాయల వరకూ LPG గ్యాస్ సిలిండర్ పైన క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు కేవలం రూ. 9 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందవచ్చు. గత నెలతో ఈ అఫర్ ముగుస్తుండగా Paytm మరొకసారి డేట్ ను ఎక్స్టెండ్ చేసింది.   

ఇది క్యాష్ బ్యాక్ అఫర్ కాబట్టి పూర్తి డబ్బును ముందుగా చెల్లించాలి. తరువాత, క్యాష్ బ్యాక్ రూపంలో 800 రూపాయలను మీరు తిరిగి పొందుతారు. దీనికోసం, మీరు Paytm నుండి గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవాల్సి వుంటుంది. ఇది చాలా సింపుల్, Paytm లో Book a cylinder పైన నొక్కాలి. తరువాత, మీకు క్రింద గ్యాస్ కంపెనీ పేర్లు కనిపిస్తాయి. ఇక్కడ మీ కావాల్సిన కంపెనీ ని ఎంచుకోవాలి.

ఉదాహరణకు మీ గ్యాస్ Indane గ్యాస్ అయితే, Indane గ్యాస్ ని ఎంచుకోండి. తరువాత, క్రింద మీ కంజ్యూమర్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. దానికి క్రింద మీ ఏజెన్సీ ఎంచుకోండి. దీనికోసం, లోపలే అప్షన్ ఇవ్వబడి వుంటుంది. ఈ విధంగా మీ బుకింగ్ అయిన వెంటనే అఫర్ యాక్టివేట్ అవుతుంది.  

LPG గ్యాస్ సిలిండర్ పైన Paytm అఫర్ చేస్తున్న ఈ క్యాష్ బ్యాక్ అఫర్ కేవలం మొదటిసారి గ్యాస్ బుక్ చేసుకునే వారికీ మాత్రమే వర్తిస్తుంది. అంతేకాదు, Paytm ఈ క్యాష్ బ్యాక్ ను పేటియం TC  ప్రకారం స్క్రాచ్ కార్డ్ రూపంలో 800 రూపాయల వరకు అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :