Pan Aadhaar Link status and link deadline ends on 31 December 2025
Pan Aadhaar Link status ను చెక్ చేసి మీ పాన్ ఆధార్ లింక్ అవ్వకపోతే వెంటనే చేయండి. ఎందుకంటే, 31 డిసెంబర్ 2025 వరకు మాత్రమే ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. ఈ డెడ్ లైన్ తేదీ లోపు పాన్ ఆధార్ లింక్ చేయని వారికి ఇక్కట్లు తప్పవని ఆదాయపు పన్ను శాఖ గట్టిగా నొక్కి చెబుతోంది. 2023 నుంచి ఈ డెడ్ లైన్ ను పెంచుతూ వచ్చింది మరియు ఇది 2025 డిసెంబర్ 31తో ముగుస్తుంది. కాబట్టి, డెడ్ లైన్ లోపు మీ పాన్‌ను ఆధార్ తో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ నిరుపయోగంగా మారుతుంది. అందుకే, మీరు మీ పాన్ మరియు ఆధార్ లింక్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి మరియు ఎలా లింక్ చేయాలో కూడా వివరంగా తెలుసుకోవడం మంచిది.
పాన్ ఆధార్ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారిక సైట్ నుండి ప్రత్యేకమైన సౌకర్యం అందించింది. దీనికోసం, ముందు మీరు ఆన్‌లైన్ లో ఆదాయపు పన్ను శాఖ (Income Tax) వెబ్‌సైట్ ను ఓపెన్ చేయండి. ఇక్కడ మెయిన్ పేజీలో క్విక్ లింక్స్ క్రింద ఉన్న బాక్స్ లో ‘లింక్ ఆధార్ స్టేటస్’ అనే టాబ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ మరియు ఆధార్ నెంబర్ నమోదు చేయడానికి బాక్స్ ఉంటాయి. ఇక్కడ అడిగిన వద్ద మీ ఆధార్ మరియు పాన్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేయండి. ఇక్కడ మీ పాన్ ఆధార్ స్టేటస్ లింక్ అయినట్లు వస్తే, మీరు కొత్తగా ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఆధార్ లింక్ అవ్వకపోతే మాత్రం ఇప్పుడే లింక్ చేయండి.
Also Read: Nothing Phone (3a) Pro: ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.!
ఆదాయపు పన్ను శాఖ అధికారిక సైట్ ఓపెన్ చేసి హోమ్‌పేజీలో “e-Pay Tax” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేసి OTP వెరిఫై చేయండి. ఇక్కడ Minor Head: 500 – Other Receipts ఎంచుకోండి. తర్వాత ‘Fee for PAN–Aadhaar linking’ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మీ అనుకూలతను బట్టి బ్యాంక్ లేదా UPI యాప్ ద్వారా రూ. 1,000 రుసుము చెల్లించండి. ఈ పేమెంట్ అయిన తర్వాత మీరు Link Aadhaar ట్యాబ్ లోకి వెళ్లి ఆధార్ పాన్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయండి. ఇక్కడితో మీ ఆధార్ పాన్ లింక్ పూర్తవుతుంది.
SMS సర్వీస్ ద్వారా కూడా పాన్ ఆధార్ లింక్ చేయవచ్చు. దీనికోసం మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నుంచి ఇక్కడ చెప్పిన విధంగా SMS పంపండి. UIDPAN ఈ ఫార్మాట్ లో మెసేజ్ ను 567678 లేదా 56161 నెంబర్ కి పంపించండి.
పాన్ ఆధార్ లింక్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే, మీ ఆధార్ మరియు పాన్ లో ఉన్న మీ పేరు మరియు DOB మ్యాచ్ కాకపోతే లింక్ ఫెయిల్ అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఆధార్ లేదా పాన్ లో ఏదైతే సరైన వివరాలు కలిగి లేదో, దాని డేటా సరిచేయాలి. ఆ తర్వాత మాత్రమే ఆ వ్యక్తి పాన్ మరియు ఆధార్ లింక్ అవుతాయి.