విరాట పర్వం తో సహా OTT లో విడుదలైన ఈ కొత్త సినిమాలను చూశారా..!!

Updated on 01-Jul-2022
HIGHLIGHTS

OTT లో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి

కొత్త సినిమాలు ఇప్పుడు నెల లోపలే ఓటీటీలో వచ్చేస్తున్నాయి

ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న కొత్త సినిమాలు

OTT లో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు ఇప్పుడు నెల లోపలే ఓటీటీలో వచ్చేస్తున్నాయి.  కొత్తగా OTT ప్లాట్ ఫామ్ పైన రిలీజైన కొత్త సినిమాలు మరియు స్ట్రీమ్ అవుతున్న లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీస్ ఈరోజు చూడనున్నాము. ఇంకెందుకు ఆలశ్యం ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఆ కొత్త సినిమాలు ఏమిటో ఒక లుక్ వేద్దాం పదండి.    

విరాట పర్వం

దగ్గుబాటి రానా మరియు సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా జూన్ 17 న థియేటర్లలో విడుదలయ్యింది. ఈ సినిమాలో కథ, సన్నివేశాలు మరియు తారల నటన వంటి అన్ని అంశాల్లో కూడా మంచి పాజిటీవ్ టాక్ అందుకుంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన కలక్షన్లను సాధించలేక పోయింది. ఈ సినిమా జూలై 1 అంటే, ఈరోజు నుండి Netflix నుండి స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమా చూడలేక పోయిన వారు నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూడవచ్చు.           

పృథ్వీరాజ్

సామ్రాట్ పృథ్వీ రాజ్ చౌహన్ జీవితం ఆధారంగా నిర్మిచిన చారిత్రక యాక్షన్ డ్రామా సినిమా ఈ 'సామ్రాట్ పృథ్వీ రాజ్'. పృథ్వీ రాజ్ చౌహన్ గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించగా సంజయ్ దత్ మరియు సోనూ సూద్ ప్రధాన పాత్రలను పోషించారు. జూన్ 3 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా కూడా ఈరోజు నుండి Prime Video నుండి ట్రీమ్ అవుతోంది.

సర్కారు వారి పాట

మే 2న థియేటర్లలో విడుదలై భారీ కలక్షన్స్ సాధించిన సర్కారు వారి పాట సినిమా OTT రైట్స్ ను అమెజాన్ భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా ముందుగా, ఈ సినిమాను జూన్ 2 నుండి రెంటల్ అప్షన్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చింది. విడుదలకు ముందునుండే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ సాధించడమే కాకుండా బ్లాక్ బాస్టర్ మూవీగా కూడా నిలిచింది. జూన్ 23 నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్స్ అందరి కోసం జూన్ 23 నుండి స్ట్రీమ్ అవుతోంది.

డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్

వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ చిత్రం మార్వెల్స్ కామిక్స్ ఆధారంగా చిత్రించబడినది. మే 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ కలక్షన్స్ సాధించింది. జూన్ 22 నుండి డిస్ని+ హాట్ స్టార్ నుండి ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. అద్భుతమైన గ్రాఫిక్స్ మరియు ఊహించని మలుపులతో వుండే స్టోరీ ప్రక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.

పెళ్లి సందD

ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన మొదటి చిత్రం 'పెళ్లి సందD'. ఈ సినిమా 2021 అక్టోబర్ 15 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఈ వారం OTT లో రిలీజ్ అయ్యింది. జూన్ 24వ తేదీ నుండి Zee 5 నుండి ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన నెల రోజులకే OTT లో రిలీజ్ అవుతున్న ఈ రోజుల్లో థియేటర్లలో విదులైన చాలా కాలం తరువాత ఈ సినిమా OTT లో రావడం ఆశ్చర్యకరం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :