Oppo మరియు OnePlus ఫోన్ల పైన నిషేదం..!!

Updated on 17-Jul-2022
HIGHLIGHTS

భారత మార్కెట్ తో సహా ఒప్పో మరియు వన్ ప్లస్ బ్రాండ్స్ ప్రపంచ వ్యాప్తంగా మంచి అమ్మకాలను సాగిస్తున్నాయి

లైసెన్స్ లేని ఒప్పో మరియు వన్ ప్లస్ ఫోన్‌ లను

నిషేధం కొనసాగుతున్నంత కాలం OnePlus మరియు Oppo ఫోన్లు అమ్మడానికి వీలుండదు

భారతీయ మార్కెట్ తో పాటుగా గ్లోబల్ మార్కెట్లో కూడా బాగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్స్ OnePlus మరియు Oppo ఫోన్ల పైన ఇప్పుడు బ్యాన్ విధించబడింది.  ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా బిజినెస్ సాగిస్తున్న ఒప్పో మరియు వన్ ప్లస్ లకు తాజాగా జరిగిన పరిణామం సమస్యల్ని తెచ్చిపెట్టింది. Oppo మరియు OnePlus ఫోన్ల పైన నిషేదం విధిస్తున్నట్లు జర్మనీ కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీనితో, ఒప్పో మరియు వన్ ప్లస్ రెండు కంపెనీల పరికరాలను జర్మనీలో అమ్మకూడదని, ఈ రెండు బ్రాండ్స్ పైన నిషేధం విధించిబడింది.

భారత మార్కెట్ తో సహా ఒప్పో మరియు వన్ ప్లస్ బ్రాండ్స్ ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో మంచి అమ్మకాలను సాగిస్తున్నాయి. వాటిలో జర్మనీ కూడా వుంది మరియు ఇప్పుడు ఈ దేశంలో ఒప్పో మరియు వన్ ప్లస్ రెండు బ్రాండ్ లకు కూడా గడ్డు కాలం ఎదురయ్యింది. నోకియా 2021 లో నమోదు చేసిన కేసు ఇప్పుడు జర్మనీలో ఒక కొలిక్కి రావడంతో ఈ చర్య జరిగింది. పేటెంట్ రైట్స్ కలిగిన నోకియా టెక్నాలజీని ఒప్పో డివైజ్ లలో లైసెన్స్ లేకుండా వాడుతున్నట్లు నోకియా అప్పట్లో ఆరోపించింది.

నోకియా ఇచ్చిన ఫిర్యాదు కారణంగా లైసెన్స్ లేని ఒప్పో మరియు వన్ ప్లస్ ఫోన్‌ లను జర్మనీలో నిషేధించారు.  జర్మనీ మన్హియంలోని ఒక కోర్ట్  ఒప్పో మరియు వన్ ప్లస్ ఫోన్‌ లను ఆ దేశంలో నిషేదిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ రెండు బ్రాండ్స్ పైన విధించిన నిషేధం పర్మినెంట్ మాత్రం కాదు. కానీ, నిషేధం కొనసాగుతున్నంత కాలం  OnePlus మరియు Oppo ఫోన్లు జర్మనీలో అమ్మడానికి వీలుండదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :