Open AI సూపర్ వీడియో జనరేటర్ యాప్ Sora ఆండ్రాయిడ్ యాప్ వచ్చేసింది.!

HIGHLIGHTS

Open AI రోజు రోజుకు తన సర్వీస్ పరిధిని మరింత విస్తరిస్తోంది

ఎఐ వీడియో జెనరేటర్ Sora App ని ఆండ్రాయిడ్ యూజర్లకు అందించింది

ఈ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ కోసం అందుబాటులో ఉంది

Open AI రోజు రోజుకు తన సర్వీస్ పరిధిని మరింత విస్తరిస్తోంది. Chat GPT తో AI ప్రపంచంలో తుఫాను సృష్టించిన ఓపెన్ ఎఐ మరిన్ని సర్వీసులు కూడా అందించింది. రీసెంట్ గా ఎఐ వీడియో జనరేటర్ Sora App ని iOS యూజర్లకు పరిచయం చేసింది. ఈ పరిధిని మరింత విస్తరిస్తూ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కూడా ఈ సూపర్ వీడియో జనరేటర్ యాప్ సోరా యాప్ ని లాంచ్ చేసింది. ఈ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ కోసం అందుబాటులో ఉంది.

Open AI Sora App

ఓపెన్ ఎఐ ముందుగా వెబ్సైట్ ద్వారా ఈ ఫీచర్ ని పరిచయం చేసింది. ఈ ఎఐ వీడియో జనరేటర్ మోడల్ గొప్ప జనాదరణ పొందడంతో యాప్ ని కూడా అందించింది. దీనికోసం ముందుగా iOS లో యాప్ అందించింది మరియు ఈ యాప్ యాపిల్ యూజర్ల నుంచి గొప్ప స్పందన అందుకుంది. ఇప్పుడు ఈ యాప్ ని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కూడా అందించింది.

అయితే, ఓపెన్ ఎఐ ఈ సోరా యాప్ ని కేవలం 7 రీజియన్ లలో మాత్రమే అందించింది. ఇందులో, ఇండియా, అమెరికా, కెనడా, జపాన్, కొరియా, తైవాన్, థాయిలాండ్ మరియు వియాత్నం ఏడు రీజన్స్ ఉన్నాయి. ఈ యాప్ ఇండియాలో ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందో ఇంకా అనౌన్స్ చేయలేదు. పెయిన్ తెలిపి ఏడు రీజియన్ లలో ఈ యాప్ నిన్నటి నుంచి గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి ఉంది. ఈ యాప్ ఇప్పటికే 500K+ కంటే ఎక్కువ డౌన్ లోడ్స్ సాధించింది మరియు మరింత డౌన్ లోడ్స్ సాధించే దిశగా పరుగులు తీస్తోంది.

Also Read: 16 వేల బడ్జెట్ ధరలో 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!

Open AI Sora App ఏమిటీ?

ఇది ఒక టెక్స్ట్ టూ వీడియో జనరేటర్ యాప్. ఈ యాప్ లో మీరు అందించే ప్రాంప్ట్ ఆధారంగా వీడియో క్రియేట్ చేయబడుతుంది. అంతేకాదు, మీ ఇమేజ్ లను వీడియో రూపంలో క్రియేట్ చేసుకోవచ్చు మరియు మీ వీడియోలను సైతం సరికొత్తగా మార్చుకోవచ్చు. ఈ ఎఐ వీడియోలు సూపర్ సౌండ్ తో జతగా అందిస్తుంది. ఓవరాల్ గా ఈ యాప్ మీ సాధారణ ఫోటోలకు ప్రాణం పోస్తుంది మరియు వీడియో లకు ఒక కొత్త రూపం అందిస్తుంది.

ఈ యాప్ Rated for 12+ ట్యాగ్ తో వచ్చింది. అంటే, 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారికి పేరెంటల్ గైడెన్స్ అవసరం లేదా ఉపయోగించరాదని చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :