OnePlus Summer Sale starts from may 1st and offering big deals
OnePlus Summer Sale నుంచి అతి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో అందించింది. ఈ సేల్ మే 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అంటే, ఈ సేల్ రేపటి నుంచి ఈ సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోవచ్చని వన్ ప్లస్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి రీసెంట్ గా విడుదలైన వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ మొదలు కొని వన్ ప్లస్ నార్డ్ సిరీస్ బడ్జెట్ ఫోన్ CE4 Lite వరకు చాలా ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్స్ అందుకోవచ్చని చెబుతోంది.
వన్ ప్లస్ సమ్మర్ సేల్ రేపటి నుంచి మొదలవుతుంది మరియు ఈ సేల్ నుంచి గొప్ప డీల్స్ అందుకోవచ్చు. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ ను వన్ ప్లస్ సమ్మర్ సేల్ నుంచి కొనుగోలు చేసే వారికి రూ. 4,000 రూపాయల అదనపు డిస్కౌంట్ మరియు రూ. 2,000 డైరెక్ట్ తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను రూ. 36,999 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చని చెబుతోంది.
ఈ సేల్ నుంచి వన్ ప్లస్ నార్డ్ సిరీస్ ఫోన్స్ పై బెస్ట్ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి నార్డ్ 4 ఫోన్ పై రూ. 500 డిస్కౌంట్ మరియు 4,500 రూపాయల వరకు ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ అందుకోవచ్చని వన్ ప్లస్ చెబుతోంది. ఇది మాత్రమే కాదు ఈ సమ్మర్ సేల్ నుంచి నార్డ్ CE 4 లైట్ రూ. 1,000 తగ్గింపు మరియు రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అందుకోవచ్చని వన్ ప్లస్ తెలిపింది.
Also Read: BSNL Plan: 395 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదిగో.!
వన్ ప్లస్ సమ్మర్ సేల్ నుంచి వన్ ప్లస్ బడ్స్ పై కూడా బెస్ట్ డీల్స్ అందిస్తున్నట్టు వన్ ప్లస్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ బడ్స్ ప్రో 3 బడ్స్ పై రూ. 2,000 డిస్కౌంట్, వన్ ప్లస్ బడ్స్ 3 పై రూ. 1,000 వరకు డిస్కౌంట్, వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 పై రూ. 400 మరియు వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2r పై రూ. 500 తగ్గింపు అందుకోవచ్చని కూడా వన్ ప్లస్ చెబుతోంది.
అంతేకాదు, ఈ వన్ ప్లస్ సమ్మర్ సేల్ నుంచి వన్ ప్లస్ వాచ్ 2 స్మార్ట్ వాచ్ పై గరిష్టంగా రూ. 7,000 రూపాయల తగ్గింపు మరియు వన్ ప్లస్ ప్యాడ్ 2 పై గరిష్టంగా 8,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు కూడా వన్ ప్లస్ పేర్కొంది.