OnePlus Pad 3: భారీ ఫీచర్స్ తో ఇండియాలో విడుదలైన వన్ ప్లస్ కొత్త ప్యాడ్.!

Updated on 06-Jun-2025
HIGHLIGHTS

వన్ ప్లస్ తన లేటెస్ట్ టాబ్లెట్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది

OnePlus Pad 3 టాబ్లెట్ ను భారీ ఫీచర్స్ తో ప్రవేశపెట్టింది

ఈ టాబ్లెట్ ను క్వాల్కమ్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ చేసింది

వన్ ప్లస్ ప్యాడ్ 3 ని చాలా స్లీక్ డిజైన్ తో అందంగా అందించింది

OnePlus Pad 3: వన్ ప్లస్ తన లేటెస్ట్ టాబ్లెట్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ టాబ్లెట్ ను భారీ ఫీచర్స్ తో ప్రవేశపెట్టింది. అదే వన్ ప్లస్ ప్యాడ్ 3 మరియు ఈ టాబ్లెట్ ను క్వాల్కమ్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ప్యాడ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది.

OnePlus Pad 3: ఫీచర్స్

వన్ ప్లస్ ప్యాడ్ 3 ని చాలా స్లీక్ డిజైన్ తో అందంగా అందించింది. ఈ టాబ్లెట్ ను స్మార్ట్ కీ బోర్డు మరియు స్టయిల్స్ పెన్ సపోర్ట్ తో అందించింది. ఈ టాబ్లెట్ ను క్వాల్కమ్ యొక్క అటున్నతమైన Snapdragon 8 Elite మొబైల్ ప్లాట్ ఫామ్ చిప్ సెట్ తో అందించింది. అంతేకాదు, ఈ ట్యాబ్ పెర్ఫార్మెన్స్ ను పీక్స్ లోకి తీసుకు వెళ్ళడానికి వీలుగా ఇందులో 16GB LPDDR5T ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది.

వన్ ప్లస్ ఈ టాబ్లెట్ ను 13.5 ఇంచ్ LCD స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 12bit కలర్ డెప్త్, 3392 x 2400 రిజల్యూషన్, HBM 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ వన్ ప్లస్ టాబ్లెట్ 4 ఉఫర్స్ మరియు 4 ట్వీటర్స్ తో మొత్తం 8 స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ లో 13MP రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. అయితే, ఈ టాబ్లెట్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

వన్ ప్లస్ ప్యాడ్ 3 టాబ్లెట్ లో 12.140mAh బిగ్ బ్యాటరీని వన్ ప్లస్ అందించింది. ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి అవసరమైన 80W సూపర్ ఊక్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఇందులో అందించింది. ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న చాలా టాబ్లెట్ లతో పోలిస్తే, ఈ వన్ ప్లస్ టాబ్లెట్ స్పెక్స్ షీట్ ప్రకారం గొప్ప పెర్ఫార్మన్స్ అందించే టాబ్లెట్ గా కనిపిస్తుంది. అయితే, ఈ టాబ్లెట్ టెస్ట్ తర్వాత దీని పూర్తి వివరాలు క్లియర్ గా అందించగలుగుతాము.

Also Read: Soundbar Deal: అండర్ రూ.4,000 బడ్జెట్ ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్స్.!

OnePlus Pad 3: ప్రైస్

వన్ ప్లస్ ఈ కొత్త ప్యాడ్ ఇండియా వేరియంట్ ప్రైస్ ను ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ ట్యాబ్ 12GB + 256GB మరియు 16GB + 512GB వేరియంట్ అప్షన్ లలో లభిస్తుందని మాత్రం కన్ఫర్మ్ చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :