సింగిల్ ఛార్జ్ తో 200 కిలోమీటర్ల మైలురాయిని చేరుకునే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చెయ్యడానికి సిద్ధమవుతున్నట్లు, భారతీయ e-స్కూటర్ తయారీ సంస్థ Okinawa ప్రకటించింది. ఈ అప్ కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను Okhi 90 పేరుతో మార్చి 24 న మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క ఛార్జింగ్ తో 200 కి.మీ దూరం ప్రయాణం చేస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఈ-బైక్ స్పీడ్ కూడా ఎక్కువేనని కూడా వెల్లడించారు. ఈ ఓకి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ 90 km/h టాప్ స్పీడ్ తో ప్రయాణించగలదని ఒకినావా చెబుతోంది.
Okinawa సహ వ్యవస్థాపకుడు, జితేంద్ర శర్మ ఒక ఇంటర్వ్యూలో Okhi 90 E-Scooter గురించి కొన్ని ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. Okhi 90 ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ తో గరిష్టంగా 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే శక్తితో ఉంటుందని తెలిపారు. Okhi 90 భారతదేశంలోని E-Scooter మార్కెట్ ఎల్లలను మార్చబోతోందని కూడా అభిప్రాయపడ్డారు.
ఇక ఈ అప్ కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఫీచర్ల గురించి చూస్తే, ఈ ఓకి 90 వేగంగా ఛార్జ్ చేసేందుకు వీలుగా ఫాస్ట్ ఛార్జింగ్ ఫంక్షనాలిటీని కలిగివుంటుంది. అంతేకాదు, ఈ ఇ-స్కూటర్ కనెక్టెడ్ వెహికల్ ఫీచర్స్ మరియు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్) తో వస్తుంది. ఈ స్కూటర్ కేవలం 4 గంటల్లోనే 80% ఛార్జింగ్ అవుతుందని కూడా కంపెనీ పేర్కొంది.
ఎలక్ట్రిక్ వాహనాల పైన ఎక్కువ వేగంతో ప్రయాణించ లేకపోవడం ఒక డ్రా బ్యాక్. అయితే, ఈ ఒకినోవా తన Okhi 90 E-Scooter తో ఈ దూరాన్ని తుడిచే ప్రయత్నం చేస్తున్నట్లు మనం అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఒక్క ఛార్జింగ్ తో 200 కి.మీ దూరం ప్రయాణం చేస్తుందంటే డబ్బుకు తగిన విలువను ఆశించవచ్చు. ఇవన్నీ కూడా ప్రస్తుతం కంపెనీ ప్రకటించిన టీజింగ్ ద్వారా మనం చూస్తున్న వివరాలు. విడుదల తరువాత ఈ స్కూటర్ ఎలా ఉంటుందో చూడాలి.
గమనిక: పైన అందించిన ఇమేజ్ అవగాహన కోసం అందించిన కల్పిత చిత్రం