ఇండియాలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో e-Bike లు మరియు ఎలక్ట్రి స్కూటర్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు సాధారణ బైక్ లు మాత్రమే అందుబాటులో ఉండగా, Oben Electric సంస్థ స్పోర్ట్ బైక్ ను తలపించే డిజైన్ మరియు ఎక్కువ దూరం ప్రయాణించగల శక్తి గల ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఓబేన్ ఈ ఎలక్ట్రిక్ బైక్ ను RORR పేరుతో ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ బైక్ 100 Km/hr టాప్ స్పీడ్ తో కూడా ప్రయాణించగలదని కూడా కంపెనీ తెలిపింది. ఈ లేటెస్ట్ బైక్ మరిన్ని ఫీచర్లు, బైక్ ధర వంటి అన్ని వివరాలను పరిశీలిద్దాం.
ఓబేన్ ఎలక్ట్రిక్ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన RORR ఎలక్ట్రిక్ బైక్ స్పోర్ట్ బైక్ ను తలపించేలా ఆకర్షణీమైన డిజైన్ లో ఉంటుంది. ఈ e-bike యొక్క Pre-Book ఇప్పటికే మొదలుపెట్టిన కంపెనీ ఈ బైక్ డెలివరీ మాత్రం జూలై 2022 నుండి ప్రారంభిస్తుందని తెలిపింది. ఇక బైక్ ధర వివరాల్లోకి వెళితే, OBEN RORR ఎలక్ట్రిక్ బైక్ ధర మహారాష్ట్రలో 99,999 రూపాయల ధరతో కోట్ చేయగా, దక్షిణ రాష్టాలైన తెలంగాణా, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో అధిక ధర కోట్ చెయ్యబడింది. పైన తెలిపిన మూడు రాష్ట్రాల్లో ఈ బైక్ ధర రూ.1,24,999 గా ప్రకటించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఈ బైక్ లభ్యత మరియు ధర వివరాలను ఇంకా కంపెనీ సైట్ లో ప్రకటించలేదు.
ఇక ఈ ఓబేన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ e-బైక్ 3 సెకన్ల లోనే 0 నుండి 40 kmph స్పీడ్ అందుకోగలదని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ 100 kmph టాప్ స్పీడ్ తో ప్రయాణించగలదు మరియు 200 కిలో మీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదని కూడా కంపెనీ వెల్లడించింది. అయితే, ట్రాఫిక్ మరియు రోడ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇది ప్రయాణించే రేంజ్ లో మార్పులు సంభవిస్తాయి. ఈ బైక్ ను కేవలం 2 గంటల్లోనే ఛార్జ్ చేయవచ్చు. ఈ బైక్ ఎరుపు , పసుపు మరియు నలుపు ముడు రంగుల్లో లభిస్తుంది. ఓబేన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ను కేవలం రూ.999 రూపాయలు చెల్లించి Pre-Book చేసుకోవచ్చు.