అమెజాన్ ఇండియా తన రైలు టికెట్ బుకింగ్ సర్వీస్ ను IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) భాగస్వామ్యంతో ప్రారంభించింది. ఇది అమెజాన్ యాప్ మరియు మొబైల్ వెబ్‌సైట్ నుండి రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి వినియోగదారులకు సహాపడుతుంది. అదనంగా, ఈ e-కామర్స్ దిగ్గజం ఇప్పుడు తన యాప్‌లో భారతదేశం అంతటా బస్సు, విమానాలు మరియు రైలు టికెట్ బుకింగ్‌లను అందిస్తుంది.
పరిచయ ఆఫర్‌లో భాగంగా, అమెజాన్ మొదటిసారి నాన్-ప్రైమ్ సభ్యులకు 10% క్యాష్‌బ్యాక్ మరియు ప్రైమ్ సభ్యులకు 12% క్యాష్‌బ్యాక్‌ను మొదటిసారిగా రైలు టికెట్లను బుక్ చేసుకోవడం పైన అందిస్తోంది. అంతేకాకుండా, సంస్థ తన రైలు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవటానికి ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి ప్రస్తుతానికి సర్వీస్ మరియు పేమెంట్ గేట్‌వే ఛార్జీలను తొలగించింది.
అమెజాన్ నుండి ప్రయాణ టికెట్ బుక్ చేసుకునే వినియోగదారులు అమెజాన్ పే సేవను ఉపయోగించి చెల్లింపులు కూడా చేయవచ్చు. ఒకవేళ వినియోగదారులు టికెట్‌ను రద్దు చేయవలసి వస్తే, అమెజాన్ పే నుండి లావాదేవీలు చేయడం వల్ల మీకు డబ్బు వెంటనే వాపసు లభిస్తుంది.