హాస్పిటల్ వెళ్లే వారికోసం సర్వీస్ ప్రారంభించిన OLA

Updated on 09-Apr-2020
HIGHLIGHTS

ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లను కార్లలో ఉంచామని ఓలా పేర్కొంది.

OLA  తన సరికొత్త OLA ఎమర్జెన్సీ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది మరియు ఈ కొత్త సౌకర్యం క్యాబ్‌ లను లాగో హాస్పిటల్స్‌కు వెళ్ళడానికి సహకరిస్తుంది. అయితే, ప్రస్తుతానికి ఈ సౌకర్యం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది మరియు వినియోగదారులు నగరంలోని 200 ఆసుపత్రులకు వెళ్లడం కోసం క్యాబ్స్ ను బుక్ చేసుకోవచ్చు. కానీ, అతి త్వరలోనే ఈ సర్వీసును పెద్ద నగరాలకు కూడా విస్తరిస్తామని ఓలా తెలిపింది.

ప్రయాణీకుల భద్రతను లక్ష్యంగా చేసుకొని, మాస్క్‌లు, శానిటైజర్లు మరియు ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లను కార్లలో ఉంచామని ఓలా పేర్కొంది.

కర్ణాటక ఆరోగ్య మంత్రి బి. శ్రీరాములు మాట్లాడుతూ, పౌరులకు అవసరమైన సేవలను అందించడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ సర్వీసును అనుమతించింది. అన్ని వైద్య అవసరాల కంస మరియు అత్యవసర పరిస్థితుల్లో ఓలా ప్రజలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందని, శ్రీరాములు పేర్కొన్నారు.

ఆదివారం, ఓలా యొక్క ప్రత్యర్థి ఉబెర్ ప్రయాణ సౌకర్యాలు కల్పించిన వారికి ప్రభుత్వం ఉబెర్ సేవలను అందిస్తుందని ప్రకటించింది మరియు నాసిక్ నుండి ఈ సర్వీస్ ప్రారంభమైంది.

అవసరమైన వస్తువుల పంపిణీని సులభతరం చేయడానికి మరియు ప్రజలు ఇంట్లో ఉండటానికి ఉబెర్ బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్ మరియు స్పెన్సర్ రిటైల్ మొదలైన వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఉబెర్ మరియు ఓలా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి వైద్య నిపుణులు మరియు ప్రభుత్వంతో పనిచేసే ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :