ఇప్పుడు Google Search తెలుగుతో సహా 5 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది

Updated on 22-Nov-2021
HIGHLIGHTS

గూగుల్ చాలా కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది

కొత్త ఫీచర్ ఇంగ్లీష్ రిజల్ట్ ను మీకు నచ్చిన భాషలోకి ఆటొమ్యాటిగ్గా అనువదిస్తుంది

లోకల్ బాష (లాంగేజ్) లోకి అనువదిస్తుంది

Google For India కార్యక్రమం నుండి గూగుల్ చాలా కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం నుండి గూగుల్ అసిస్టెంట్, గూగుల్ సెర్చ్,  గూగుల్ పే మరియు గూగుల్ సర్వీస్‌ల కోసం అనేకమైన ప్రత్యేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. వీటితో పాటుగా, వెబ్ పేజీలను కోరుకున్న లేదా ఎంపిక చేసిన భాషల్లోకి ఆటొమ్యాటిగ్గా తర్జుమా చేసే ఫీచర్ ను కూడా అందించింది మరియు ఇది మరింత ఉపయోగపడే ఫీచర్ గా చెప్పుకోవచ్చు.

ఇంతకు ముందు, ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషల్లో సెర్చ్ చెయ్యాలని ప్రయత్నించినప్పుడు, Google Search ఆ రిజల్ట్ ను ఎంచుకున్న భాషలో అందించడంలో విఫలమయ్యేది. ఆ సెర్చ్ రిజల్ట్ ను కోరుకున్న భాషలో కాకుండా ఇంగ్లీష్ లో మాత్రమే అందించేది. కానీ, ఇపుడు గూగుల్ ఈ అవాంతరాన్ని తొలగించడానికి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తునట్లు చెబుతోంది. ఈ కొత్త ఫీచర్ ఇంగ్లీష్ రిజల్ట్ ను మీకు నచ్చిన భాషలోకి ఆటొమ్యాటిగ్గా అనువదిస్తుంది (translate).

అంటే, ఈ కొత్త ఫీచర్ తరువాత అధిక నాణ్యత గల కంటెంట్ ను గూగుల్ మీరు కోరుకున్న లోకల్ బాష (లాంగేజ్) లోకి అనువదిస్తుంది. అనువదించిన తరువాత సెర్చ్ రిజల్ట్ పైన నొక్కడం ద్వారా ఆ మీరు కోరుకున్న భాషలో కంటెంట్‌ని చూడగలిగే పేజీకి చేరుకుంటారు. అయితే, ప్రస్తుతానికి ఈ ఫీచర్ సైన్స్ మరియు ఎడ్యుకేషన్ ప్రశ్నలకు మాత్రమే పని చేస్తుంది.

గూగుల్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ తెలుగు, హిందీ, కన్నడ, తమిళం మరియు మలయాళంతో కలిపి ఐదు భారతీయ భాషలలో అన్ని మొబైల్ బ్రౌజర్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :