గూగుల్ ఇండియా తన మ్యాప్ లో ఒక కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. కరోనావైరస్ బారిన పడిన నగరాల్లో నైట్ షెల్టర్స్ మరియు ఫుడ్ షెల్టర్స్ కోసం ఈ సెర్చ్ దిగ్గజం, ఇప్పుడు ప్రత్యేక ఎంపికను తీసుకొచ్చింది. భారత ప్రభుత్వ సహాయంతో ఈ కొత్త ఫీచరును ప్రవేశపెట్టారు. గూగుల్ మ్యాప్స్ లేదా గూగుల్ అసిస్టెంట్ లో కనిపించే Search రన్ లో ప్రభుత్వం నడుపుతున్న ఆశ్రయాలను గుర్తించగలదు.
గూగుల్ యొక్క ఈ క్రొత్త ఫీచర్, ప్రస్తుతం 30 నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ సంస్థ, త్వరలోనే ఈ జాబితాకు మరొక స్థానాన్ని కూడా జోడించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంగ్లీషులో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ఈ ఫీచరును త్వరలో హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రవేశపెట్టనునట్లు గూగుల్ పేర్కొంది.
ఈ స్థానాలను(లొకేషన్) కనుగొనడానికి, మీరు Search బాక్స్ లో ఫుడ్ షెల్టర్ లేదా నైట్ షెల్టర్ అని టైప్ చేయడం ద్వారా నేరుగా వెతకవచ్చు. అయితే, కొన్ని ఫోన్లలో, హోమ్ స్క్రీన్ పైన ఉన్న ఎంపికలలో ఫుడ్ షెల్టర్ లేదా నైట్ షెల్టర్ వంటి ఎంపికలు కనిపిస్తాయి. ఈ ఆదేశాలను వాయిస్ ద్వారా కూడా ఇవ్వవచ్చు. జియోఫోన్ వినియోగదారులు గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఈ షేల్టర్ల జాబితాను కూడా చూడవచ్చు.
ముఖ్యంగా, భారతదేశంలో 14 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ప్రధాన నగరాల నుండి తిరిగి వచ్చే కార్మికులు మరియు వలసదారుల కోసం ఈ చర్యలు తీసుకోబడ్డాయి. రవాణా లేకపోవడం వల్ల తమ స్వస్థలానికి చేరుకోవడానికి బయలుదేరిన వారు, ఈ ఆహారం మరియు రాత్రి ఆశ్రయాలు, అటువంటి పేద ప్రజలకు సేవ చేస్తాయని ఆశిద్దాం.