Good News: ఇక ఆధార్ అప్డేట్ మరింత సులభం

Updated on 08-May-2020

ఈ సమయంలో భారతీయ పౌరులకు ఆధార్ చాలా ముఖ్యమైన పత్రం. మనం బ్యాంకులో ఖాతా తెరివడం మొదలుకొని  గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవడానికి కూడా ఆధార్ అవసరం. అటువంటి ఈ  ఆధార్ కార్డులో మీకు సంబంధించిన ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే, మీకు అది పెద్ద సమస్య కూడా కావచ్చు. మీ ఆధార్ కార్డులో చిరునామా మొదలైనవాటిని అప్‌డేట్ చేయాలనుకుంటే, ఇప్పుడు మీరు కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) కి వెళ్లి ఆధార్‌ ను కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు.

20,000 సాధారణ సేవా కేంద్రాలు ఆమోదించబడ్డాయి

సుమారు 20,000 సాధారణ సేవా కేంద్రాలకు ఆధార్‌ ను అప్‌డేట్ చేయడానికి UIDI ఆమోదం తెలిపింది. ఈ అన్ని కేంద్రాలలో ఆధార్ అప్డేట్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. ఇది కాకుండా, CSC లో జనాభా డేటాను కూడా నఅప్డేట్ చెయ్యవచ్చని UIDI పేర్కొంది. అంటే, ఇక్కడ ఆధార్ అప్డేట్ కోసం, ఆధార్ హోల్డర్ ఫింగర్ స్కానర్లు మరియు కంటి స్కానర్ తో గుర్తించబడుతుంది.

ఇంటి అడ్రెస్స్ కూడా అప్డేట్ చేయవచ్చు

మీరు ఈ ఆధార్ కేంద్రాల నుండి మీ ఆధార్ చిరునామాను మార్చకోవచ్చు మరియు ఇక్కడ పిల్లల బయోమెట్రిక్ వివరాలను కూడా అప్డేట్ చెయ్యవచ్చు. జూన్ చివరి నాటికి ప్రజలు ఈ వ్యవస్థను సద్వినియోగం చేసుకోగలరని UIDI తెలిపింది. వీటి పనులు ఇంకా  కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 2.74 లక్షలకు పైగా కేంద్రాలు పనిచేస్తున్నాయి మరియు ఇవన్నీ దేశంలోని గ్రామీణ ప్రాంతాల పైన  దృష్టి సారించాయి.

CSC కాకుండా నేను ఆధార్ అప్డేట్ ఎక్కడ పొందవచ్చు ?

CSC తో పాటు, బ్యాంకు శాఖలు, పోస్టాఫీసులు మరియు ప్రభుత్వ ప్రాంగణాల్లోని UIDI  యొక్క గుర్తింపు పొందిన కేంద్రాలలో ఆధార్-అనుసంధాన సేవలను పొందవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :