Noise న్యూ ఇయర్ స్పెషల్ లాంచ్: కేవలం రూ.1,999 ధరకే సూపర్ స్మార్ట్ వాచ్

Updated on 03-Jan-2022
HIGHLIGHTS

స్మార్ట్ వాచ్ కొనాలని చూస్తున్న వారికి Noise గుడ్ న్యూస్

Noise Color Fit Caliber స్మార్ట్ వాచ్ రూ.1,999 ధరకే ఆఫర్ చేయనున్నట్లు Noise ప్రకటించింది

ఈ అఫర్ ధరను పొందడానికి ముందుగా Register చేసుకోవాల్సి ఉంటుంది

స్మార్ట్ వాచ్ కొనాలని చూస్తున్న వారికి Noise గుడ్ న్యూస్ అందించింది. కొత్త సంవత్సర ప్రారంభంలో లాంచ్ చేస్తున్న Noise Color Fit Caliber స్మార్ట్ వాచ్ ను న్యూ ఇయర్ యొక్క స్పెషల్ లాంచ్ ధరతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ వాచ్ 1.69 లార్జ్ LCD డిస్ప్లే స్టైలిష్ డిజైన్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ MRP ధర రూ.3,999 కాగా న్యూ ఇయర్ లాంచ్ అఫర్ క్రింద ఈ స్మార్ట్ వాచ్ ను కేవలం రూ.1,999 ధరకే ఆఫర్ చేయనున్నట్లు Noise ప్రకటించింది.

అయితే, ఈ అఫర్ ధరను పొందడానికి ముందుగా Register చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం, Flipkart లేదా Noise అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు.     

Noise Color Fit Caliber: ఫీచర్లు మరియు లాంచ్ డేట్

ఈNoise Color Fit Caliber ను ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా లాంచ్ చేస్తోంది మరియు ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ వాచ్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజ్ చేస్తోంది. ఈ బ్యానర్ ద్వారా చాలా ఫీచర్లను రివీల్ కూడా చేసింది. నోయిస్ ఈ స్మార్ట్ వాచ్ ను 2022 జనవరి 6వ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నది.

ఈ స్మార్ట్ వాచ్ 5 అందమైన కలర్ అప్షన్ లలో కనిపిస్తోంది మరియు ప్రీమియం లుక్ ఇచ్చేలా Flat-Edge డిజైన్ తో ఈ స్మార్ట్ వాచ్ ను అందించింది. ఇందులో 1.69 ఇంచ్ పెద్ద LCD డిస్ప్లే 15- రోజుల నిలిచే బ్యాటరీని కూడా జతచేసినట్లు కంపెనీ చెబుతోంది. ఇందులో మీ వర్కవుట్ కోసం 60 Sports Modes ను కూడా అఫర్ చేస్తోంది. బాడీ టెంపరేచర్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటర్, స్ట్రెస్ మోనిటర్, స్లీప్ మోనిటర్ మరియు 150 పైచిలుకు కష్టమైజబుల్ క్లౌడ్ వాచ్ ఫేస్ లను కూడా ఇందులో అందించింది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :