ప్రస్తుతం OTT కొత్త సినిమాలు చాలా వేగంగా రిలీజ్ అవుతున్నాయి. లాక్ డౌన్ ముగిసిన తరువాత సినిమాలు థియేటర్లలో వరుసగా రిలీజ్ అవ్వడం, వెను వెంటనే OTT లో రిలీజ్ కావడం పరిపాటిగా మారిపోతోంది. మార్చ్ మరియు ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు చాలా సినిమాలు OTT లో స్ట్రీమ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, Netflix, AHA, డిస్నీ+ హాట్ స్టార్, SonyLiv మరియు Zee5 పైన చాలా బ్లాక్ బాస్టర్ సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి. మరి లేటెస్ట్ గా వచ్చిన ఈ కొత్త సినిమాలను మీరు చూశారా..!
ఒకవేళ చూడకపోయినట్లయితే వెంటనే చూసేయండి. రీసెంట్ గా OTT లో చాలా బ్లాక్ బాస్టర్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆలశ్యం చెయ్యకుండా ఓటిటీ లో స్ట్రీమ్ అవుతున్న లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాలు గురించి చూద్దాం.
సినిమా థియేటర్లలో మార్చ్ 4న రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా IMDb లో 6.5 రేటింగ్ తో యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో శర్వానంద్, రష్మికా మందన్న, ఖుష్బూ మరియు రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. కామెడీ, సెంటిమెంట్ మరియు బంధాలకు ప్రాధాన్యతనిస్తూ తీసుకొచ్చిన ఈ సినిమా ఆడవారిని అధికంగా ఆకర్షిస్తుంది. ఈ సినిమా SonyLiv OTT ప్లాట్ ఫామ్ నుండి స్ట్రీమ్ అవుతోంది.
దివంగత కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరిగా నటించిన చిత్రం జేమ్స్ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధించింది. ఈ కన్నడ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏప్రిల్ 14న SonyLiv నుండి స్ట్రీమ్ అవుతోంది. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ జేమ్స్ మూవీ ఒక సెక్యూరిటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న సంతోష్ కుమార్ కథను చెబుతుంది. ఈ సినిమాలో మాదకద్రవ్యాల వ్యాపారంలో చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించే బాధ్యత హీరోది. ఆ తరువాత ఏం జరిగిందన్నది సినిమా.
రాజ్ తరుణ్ హీరోగా నటించిన స్టాండ్ అప్ OTT స్ట్రీమ్ అవుతోంది. AHA నుండి ఈ సినిమా 8 ఏప్రిల్ నుండి స్ట్రీమ్ అవుతోంది. ఇది జీవితంలో ఎవరికి కోసం ఎప్పుడూ నిలబడని ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరిన తరువాత ప్రేమలో పడి జీవితంలో ప్రతి విషయంలో నిలబడాలని నేర్చుకుంటాడు. ఇది ఒక రొమాన్స్ కామెడీ సినిమా మరియు ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరో ఇన్ గా నటించగా ఇంద్రజ, వెన్నెల కిశోర్ మరియు మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.
సూర్య నటించిన సూపర్ యాక్షన్ మూవీ ET ఈరోజు Netflix మరియు Sun Next రెండు ప్లాట్ ఫామ్స్ నుండి స్ట్రీమ్ అవుతోంది. తమిళంలో ET (ఎతరక్కుమ్ తునిందవన్) మరియు తెలుగులో ET (ఎవరికి తలవంచడు) పేరుతో వచ్చిన సూర్య యాక్షన్ మూవీ ఈరోజు నుండి OTT లో స్ట్రీమ్ అవుతోంది. పక్కా మాస్ మసాలా మరియు జబర్దస్త్ యాక్షన్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, మార్చి 10 న ప్రంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 175 కోట్ల వరల్డ్ వైడ్ కలక్షన్ సాధించినట్లు చెబుతున్నారు.
రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11న థియేటర్లలో విడుదలయ్యింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే మరియు భాగ్యశ్రీ కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించారు మరియు ఈ చిత్రానికి కె.కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1970 ల కాలం నాటి యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామా చిత్రం. అలాగే, ఈ సినిమాలో విజువల్స్ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయని కితాబు అందుకున్నారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో నుండి స్ట్రీమ్ అవుతోంది.