ట్రెండీ వాట్స్ఆప్ ట్రిక్: మీ ఫోటో లేదా వీడియోనే స్టిక్కర్ గా మార్చండి

Updated on 31-Mar-2021
HIGHLIGHTS

వాట్స్ఆప్ యూజర్ల కోసం కొత్త ట్రిక్

మీ ఫోటోలు లేదా వీడియోలే స్టిక్కర్లు

వాట్స్ఆప్ లో స్నేహితులతో లేదా ఇష్టమైన వారితో చాటింగ్ చేసేప్పుడు టైపింగ్ కంటే ఎక్కువగా స్టిక్కర్లను వాడుతుంటారు. ఇది సర్వసాధారణంగా ప్రతి ఒకరు చేసే విషయమే. కానీ, మీ ఫోటోలు లేదా వీడియోలను స్టిక్కర్లుగా మార్చి వాటిని పంపిస్తే ఎలా వుంటుంది. మీకు ఫ్రెండ్ మరియు మీకు ఇష్టమైన వారికీ ఇది చాలా సర్ప్రైజింగా వుంటుంది.

అందుకే ఈరోజు ఈ ట్రిక్ ఎలా చేయాలో చూద్దాం. దీని కోసం మీరు ఎక్కువగా కష్టపడాల్సిన ఆవాసరం లేదు. గూగుల్ ప్లే స్టోర్ నుండి Animated Sticker Maker WAStickerApps ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. ఈ యాప్ ఓపెన్ చేసిన తరువాత మీకు యానిమేషన్ క్రియేషన్ అప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోన్ గ్యాలరీ నుండి మీకు కావాల్సిన ఫోటో లేదా వీడియోను ఎంచుకొని సేవ్ చేయాలి.

తరువాత, వాట్స్ఆప్ స్టిక్కర్స్ అప్షన్ లో మీరు సేవ్ చేసిన వీడియో యొక్క వీడియో టూ యానిమేటెడ్ స్టిక్కర్స్ అప్షన్ కనిపిస్తుంది. ఇక మీకు కావాల్సిన వీడియోలు మరియు ఫోటోలను మీకు నచ్చినట్లుగా స్టికర్ గా మార్చుకొని మీ స్నేహితులు మరియు ఇష్టమైన వారికీ లేదా ఇంకెవరికైనా సరే పంపించవచ్చు.                

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :