New Toll Rules for non FASTag vehicles from November 15
New Toll Rules: FASTag లేని వాహనాల కోసం ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన ఈ టోల్ గెట్ రూల్స్ ద్వారా ఫాస్ట్ ట్యాగ్ లేకుండా నేషనల్ హై పై ప్రయాణించే వాహనాలకు కొత్త టోల్ రేట్లు వర్తిస్తాయి. అంటే, వాహనదారులు చెల్లించే పేమెంట్ మోడ్ ను బట్టి ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి. అయితే, ఫాస్ట్ ట్యాగ్ కలిగిన వాహనాలకు మాత్రం ఎటువంటి మార్పులు ఉండవు. ముఖ్యంగా, క్యాష్ మోడ్ పేమెంట్ చేసే వారికి ఇక టోల్ గేట్ వద్ద డబుల్ పేమెంట్ చెల్లించాల్సి వస్తుంది. ఈ కొత్త రూల్స్ 2025 నవంబర్ 15వ తేదీ నుంచి అమలు చేయబోతున్నట్లు చెబుతున్నారు.
డిజిటల్ పేమెంట్స్ కి మరింత ప్రోత్సాహం అందించడం కోసం ప్రభుత్వం ఈ కొత్త టోల్ గెట్ రూల్స్ తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. కొత్త రూల్స్ ప్రకారం, సరైన ఫాస్ట్ ట్యాగ్ లేనటువంటి వాహనాలు 2025 నవంబర్ 15వ నుంచి అధిక ఫీజులు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఫాస్ట్ ట్యాగ్ కలిగిన యూజర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఇక కొత్త టోల్ గేట్ ఫీజుల విషయానికి వస్తే, వ్యాలిడ్ ఫాస్ట్ లేకుండా నేషనల్ హైవే పై పయనించే వాహనాలు టోల్ గేట్ UPI ద్వారా పేమెంట్ చేస్తే 1.25 రేట్లు టోల్ గెట్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అదే క్యాష్ పేమెంట్ చేసే వాహనాలకు ఏకంగా డబుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే, ఫాస్ట్ ట్యాగ్ కలిగిన వాహనదారుడు టోల్ గెట్ వద్ద రూ. 100 చెల్లిస్తే, UPI పేమెంట్ చేసే వారు రూ. 125 రూపాయలు చెల్లించాల్సి వస్తే, క్యాష్ పేమెంట్ చేసేవారు ఏకంగా రూ. 200 చెల్లించాల్సి వస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ వద్ద పారదర్శకమైన పేమెంట్ మోడ్ మరియు డిజిటల్ చెల్లింపు జరిగేలా చూడటానికి ఇది తగిన మార్గం అవుతుంది. అందుకే, ప్రభుత్వం ఈ కొత్త రూల్ తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు.
Also Read: Flipkart Sale భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో అతి చవక ధరలో లభిస్తున్న Realme P4 5G
2025 నవంబర్ 15వ తేదీ నుంచి ఈ కొత్త టోల్ గెట్ రూల్స్ అమలులోకి వస్తాయని చెబుతున్నారు. ఈ కొత్త రూల్స్ మొదలైతే ఫాస్ట్ ట్యాగ్ లేకుండా నేషనల్ హైవే పైకి ఎక్కే వాహనాలకు టోల్ గెట్ ఫీజులు దారుణంగా ఉంటాయి కాబట్టి, ఈ గడువు లోపుగా మీ వాహనం కోసం ఫాస్ట్ ట్యాగ్ కలిగి ఉండటం చాలా ఉత్తమంగా ఉంటుంది. లేకపోతే మీ జేబుకు చిల్లుపడుతుంది జాగ్రత్త సుమీ.