SBI తన బ్యాంక్ ATM విత్ డ్రా రూల్స్ ని మర్చినట్లు ప్రకటించింది. అంతేకాదు, 2020 జనవరి 1 వ తేదీ నుండి ఈ మార్పులు అమల్లోకి తెస్తోంది. ఇక విషయం గురించి పరిశీలిస్తే, 10,000 రుపాయల కంటే ఎక్కువగా డబ్బులు ATM నుండి విత్ డ్రా చేసేవారికి కొత్త OTP ఆధారిత విత్ డ్రా చేయాల్సి ఉంటుంది. అంటే, మీరు గనుక SBI బ్యాంకు వినియోగదారుడు అయ్యివుండి, రూ.10,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బును ATM నుండి విత్ డ్రా చేయాలనుకుంటే, OTP ద్వారా మాత్రమే డబ్బును విత్ డ్రా చెయ్యగలరు.
వాస్తవానికి, ఇప్పటి వరకూ ఏ బ్యాంకు అయినా సరే ATM నుండి డబ్బులు విత్ డ్రా చెయ్యాలంటే ATM కార్డు మరియు దాని PIN ఉంటే సరిపోతుంది. కానీ, జనవరి 1 నుండి మారానున్నSBI బ్యాంక్ ATM విత్ డ్రా రూల్స్ ప్రకారం, ATM నుండి డబ్బులు విత్ డ్రా చెయ్యాలంటే ATM కార్డు మరియు OTP తో మాత్రమే వీలవుతుంది. తమ వినియోగదారుల సెక్యూరిటీ మరింత పటిష్టంగా ఉంచడం కోసం SBI ఈ చర్యలను తీసుకున్నట్లు చెబుతోంది.
అయితే, ఇక్కడ ఒక సమస్యవుంది. అదేమిటంటే, వినియోగదాహరుడు తమ బ్యాంకు అకౌంటుతో రిజిస్టర్డ్ చేసుకున్న మొబైల్ నంబరు పైన మాత్రమే ఈ OTP ని అందుకుంటారు. ఒకవేళ, ఈ నంబరు మారిపోయినా లేదా కొత్త నంబరును బ్యాంకులో నమోదు చేయక పోయినా మీ ఈ డబ్బును విత్ డ్రా చెయ్యడం కుదరదు. కాబట్టి, మీరు గనుక మీ నంబరును మార్చినా లేదా కొత్త నంబరును రిజిస్టర్ చేయ్యక పోయినా, త్వరగా చేయండి.