Netflix సబ్ స్క్రైబర్స్ కోసం గుడ్ న్యూస్ ప్రకటించింది. అమెజాన్ తన ప్రైమ్ మెంబర్ షిప్ ధరను 50% పెంచగా, నెట్ ఫ్లిక్స్ మాత్రం 60% తగ్గించింది. నెట్ ఫ్లిక్స్ లేటెస్ట్ గా తన మెంబర్ షిప్ రేట్ ను గరిష్టంగా 60% వరకు తగ్గించింది. అంటే, క్లియర్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు ప్రిమియంగా ఉన్న నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లిగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, నెట్ ఫ్లిక్స్ నాలుగు కేటగిరీలలో తన సర్వీస్ ప్లాన్స్ ను అఫర్ చేస్తోంది. వీటిలో మొబైల్, బేసిక్, స్టాండర్డ్ మరియు ప్రీమియం ప్లాన్స్ ఉన్నాయి. నిన్నటి వరకూ మొబైల్ ప్లాన్ రూ.199 రూపాయలకు వస్తుండగా ఈరోజు నుండి కేవలం రూ.149 రూపాయల చవక ధరకే లభిస్తుంది. అంటే, నేరుగా 25 శాతం ఈ ప్లాన్ రేటును తగ్గించింది.
అలాగే, నెలకు రూ.499 రూపాయలుగా వున్న బేసిక్ ప్లాన్ ను 60% తగ్గించి కేవలం రూ.199 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఇక స్టాండర్డ్ ప్లాన్ నెలకు రూ.649 ధరకు వస్తుండగా ఈరోజు నుండి కేవలం రూ.499 రూపాయలకే లభిస్తుంది.
ఇక చివరి ప్లాన్ ప్రీమియం ప్లాన్ ముందుగా రూ.799 ధరతో ఉండగా ఇప్పుడు కేవలం నెలకు రూ.649 రూపాయల తక్కువ ధరకే అందుకోవచ్చు. మొత్తంగా పెరిగిన కాంపిటీటర్ ధరలను బేస్ చేసుకోని చూస్తే Netflix మార్కెట్లో ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.