భూమిని ఒక గ్రహశకలం ఢీకొట్టనుందని వదంతులు : భయపడవద్దని చెప్పిన NASA అంతరిక్ష సంస్థ

Updated on 28-Apr-2020
HIGHLIGHTS

గ్రహశకలం 6.3 మిలియన్ కిలోమీటర్ల దూరంలో మన గ్రహం చుట్టూ తిరుగుతుందని అంచనా వేశారు.

ఇప్పటికే , మీరు భూమికి అటు సమీపంగా ప్రయాణించనున్న గ్రహశకలాలు గురించి భయానక ముఖ్యాంశాలు చదివే ఉంటారు? మన  ఫేస్ బుక్ ఫీడ్స్ అటువంటి కంటెంట్ లతో నిండి ఉంటాయి. కాని ఈ పరిణామానికి సంబంధించిన  వివరాలతో వచ్చాము. ఈ గ్రహశకలం వలన భూమికి ఎటువంటి ముప్పు వాటిల్లదు. అంటే, కొంచెం కూడా ముప్పు లేదు. space.com యొక్క నివేదికలో, శాస్త్రవేత్తలు ఏప్రిల్ 29 న, గ్రహశకలం 6.3 మిలియన్ కిలోమీటర్ల దూరంలో మన గ్రహం చుట్టూ తిరుగుతుందని అంచనా వేశారు. విస్తారమైన ఈ విశ్వ స్థాయిలో, 6.3 మిలియన్ కిలోమీటర్ల దూరం అంటే, అంత ఎక్కువ దూరం కాదు. కానీ, ఇది భూమిని ఏ విధంగానైనా ప్రభావితం చేసే అవకాశం లేదు. కాబట్టి, మన భూమి కోసం ఒక గ్రహశకలం రావడం లేదు మరియు Dooms Day యొక్క జోస్యం తప్పు అని మీకు చెబుతునాన్ను.

1998 OR2 గా పిలువబడే ఈ గ్రహశకలం 2.4 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది మరియు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే, ఈ గ్రహశకలం భూమికి మరియు  చంద్రునికి ఉన్న దూరంతో పోలిస్తే , అది మన నుండి 16 రెట్లు దూరంగా ఉంటుంది. అదే నివేదిక ప్రకారం, శాస్త్రవేత్తలు మరియు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రస్తుతానికి, ఏ పెద్ద గ్రహశకలం భూమిని తాకదని నిర్ధారించారు. కాలిఫోర్నియాలోని పసాదేనాలోని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో నాసా యొక్క సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ మేనేజర్ పాల్ చోడాస్ మాట్లాడుతూ "భూమిని ఢీకొట్టే ముఖ్యమైన పరిమాణాలు ఏ గ్రహశకలాలో లేవు." మా జాబితాలో ఇలా ఏ శకలం లేదు. "

ఈ ప్రకటనపై నాసా నమ్మకంగా ఉంది, ఎందుకంటే ఈ స్పేస్ ఏజెన్సీ, భూగ్రహం సమీపంలోని వివిధ గ్రహశకలాలను ట్రాక్ చేసింది మరియు వాటిలో ఏవీ భూమిని ఢీకొట్టడానికి దగ్గరగా రావు అనే నమ్మకంతో ఉంది. కానీ, ఈ వార్త మమ్మల్ని నిర్లక్ష్యంగా చేయకూడదని మరియు ఇటువంటి పరిణామాలకు అవకాశం చాలా తక్కువైనా కూడా భవిష్యత్తులో  ఇది మారొచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. గ్రహశకలం భూమిని తాకే సంభావ్యత తక్కువగా ఉన్నప్పటికీ, ఇది అనివార్యమైన దృగ్విషయం అని శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఇది  త్వరలో జరగకపోవచ్చు, కానీ అది ఎప్పటికైనా జరగవచ్చు  చెబుతున్నారు.

కానీ, మన వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మరియు డిటెక్షన్ సిస్టమ్స్ ను బట్టి చూస్తే, భూమి యొక్క ఉపరితలం పైకి రానున్న ఒక గ్రహశకలం నుండి ఉత్పన్నమయ్యే విపత్తును ఎదుర్కోవటానికి మానవాళి  ఒక ప్రణాళికను సిద్ధం చెయ్యవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :