Moto G22: రేపు విడుదలవుతున్నమోటరోలా ఫోన్..ఇవే ఫీచర్లు..!

Updated on 20-Apr-2022
HIGHLIGHTS

Moto G22 స్మార్ట్ ఫోన్ ఇండియా విడుదల కానుంది

90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు 50MP క్వాడ్ రియర్ కెమెరా

Helio G37 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది

Moto G22 స్మార్ట్ ఫోన్ ఇండియా రేపు విడుదల కానుంది. ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు 50MP క్వాడ్ రియర్ కెమెరాతో వస్తోంది. వాస్తవానికి, గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ను మోటరోలా ఇండియాలో ఇప్పుడు విడుదల చేస్తోంది. ఈ ఫోన్ కోసం Flipakrt ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. Moto G22 గ్లోబల్ వేరియంట్ ను ఎటువంటి మార్పులు లేకుండా అలాగే ఇండియాలో కూడా విడుదల చేస్తున్నట్లు కనిపిస్తోంది.          

Moto G22: స్పెక్స్

మోటో జి22 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల HD+ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే మధ్యలో పంచ్ హోల్ డిజైన్ ను కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G37 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మోటో జి22 Android 12 ఆధారంగా Motorola యొక్క My UX సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. డేడికేటెడ్ మైక్రో SD కార్డ్ తో 256GB వరకూ మెమొరీని విస్తరించవచ్చు.

ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందుభాగంలో వున్నా సెంటర్ పంచ్ హోల్ కటౌట్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది.  ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ నానో-సిమ్, USB-C సాకెట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 తో ఉంటుంది.

Moto G22: ధర (గ్లోబల్)

మోటో జి22 స్మార్ట్ ఫోన్ యూరోప్‌ లో 169.99 యూరోలు (సుమారు Rs.14,255) ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లూ, వైట్, గ్రీన్ మరియు బ్లాక్ కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :