Mirchi Plus: ఆడియో OTT యాప్ లాంచ్ చేసిన మిర్చి..

Updated on 01-Jul-2022
HIGHLIGHTS

Mirchi ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది

మిర్చి తన 'Mirchi Plus' ఆడియో OTT యాప్ ను లాంచ్ చేసింది

ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు iOS లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది

ఇండియా యొక్క No.1 సిటీ-సెంట్రిక్ మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ Mirchi ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. మిర్చి తన 'Mirchi Plus' ఆడియో OTT యాప్ ను లాంచ్ చేసింది. ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు iOS లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. సంగీత ప్రియులను అలరిస్తున్న ఈ సంస్థ, మిర్చిప్లస్ యాప్ తో ఒరిజినల్ ఆడియో కథనాలు, పొడ్‌క్యాస్ట్‌లు, మిర్చి యొక్క ఆల్ టైం ఎంటర్టైన్మెంట్ వీడియోలు, ఎంటర్టైన్మెంట్ వార్తలు & మరిన్నింటితో నిండిన భారీ లైబ్రరీని అందిస్తుంది.

Mirchi Plus యాప్ ఇంగ్లీషు, హిందీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, బంగ్లా, తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ  వంటి 10 విభిన్న భాషల్లో కంటెంట్‌ను అందిస్తుంది. అలాగే,  డ్రామా, కామెడీ, రొమాన్స్, హారర్, థ్రిల్లర్ వంటి మరిన్ని ఆడియో కథనాలను కూడా అందిస్తుంది. Mirchi Plus అభిమానులు & శ్రోతలు Mirchi కంటెంట్ లైబ్రరీని ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. మిర్చి ప్లస్ యాప్ ఆపిల్ మరియు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ లతో పాటు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే సిస్టమ్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

మిర్చి ఎల్లప్పుడూ సంగీత ప్రియుల మొదటి చాయిస్ మరియు 'మిర్చి ప్లస్' లాంచ్ తో ఇప్పుడు మీకు కథలు చెప్పడంతో పాటుగా అసలైన కంటెంట్ యొక్క ఉత్తేజకరమైన వాతావరణంలోకి మిమ్మల్ని తీసుకెళుతాము, అని  మిర్చి ప్లస్ యాప్ లాంచ్ సందర్భంగా BCCL మేనేజింగ్ డైరెక్టర్ Mr. వినీత్ జైన్ తెలిపారు.

మిర్చి రెండు దశాబ్దాలుగా రేడియో పరిశ్రమలో దాని అత్యుత్తమ ఆడియో ఎంటర్‌టైన్‌మెంట్‌ తో ఆధిపత్యం చెలాయించింది. మా వినియోగదారుల అవసరాలు మరియు వినోదం కోసం డిజిటల్ మార్గాలను వేగంగా స్వీకరించడం ద్వారా, మేము మా వినియోగదారుల ఎంగేజ్మెంట్ ను మరింతగా విస్తరించాలని మరియు మా వినియోగదారులు ఉన్న చోట మేము ఉండాలనుకుంటున్నాము. దీన్ని 'మిర్చి ప్లస్' యాప్ మా డిజిటల్ ప్లే ని బలోపేతం చేస్తుందని, ENIL, MD & CEO, Mr. ప్రశాంత్ పాండే వివరించారు.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :