సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా ‘అడవి’ శేష్ హీరోగా నటించిన 'మేజర్' కాసుల వర్షం కురిపిస్తోంది. జూన్ 3 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తక్కువ థియేటర్లలో విడుదలైన కూడా నిలకడగా కొనసాగింది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్ పెద్ద పెద్ద స్టార్స్ నటించిన 'విక్రమ్' మరియు అక్షయ్ కుమార్ నటించిన 'పృథ్వీరాజ్' రెండు సినిమాలకు దీటుగా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా ఇప్పటి వరకూ బాక్సాఫీస్ వద్ద 60 కోట్లకు పైగా కలక్షన్స్ సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
26/11 ముంబై దాడిలో వీర మరణం పొందిన 'సందీప్ ఉన్ని కృష్ణన్' జీవిత వృత్తాంతాన్ని (బయోపిక్) గా మేజర్ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అందరి నోటా అనిపించింది. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఆకట్టుకుందని, విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది. 2008 లో జరిగిన 26/11 ముంబై దాడి కధానాలను కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసిన చిత్ర యూనిట్ కి హ్యాట్సాఫ్.
ఈ సినిమా 13 వ రోజు కూడా మంచి మంచి కలక్షన్ సాధించినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా హిందీ ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది. వాస్తవానికి, ఈ సినిమా అందరూ చూసేందుకు అందుబాటులో ఉండేలా చూసేందుకు టికెట్ రేట్లను చాలా తక్కువగా ఉంచడం కూడా గొప్ప విషయం.