Maharashtra government reached center cooperation for Online Gaming Ban
Online Gaming Ban: ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ కోసం సత్వర చర్యలు తీసుకోవాలని, దాని కోసం కేంద్రం సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కాలంలో పెరుగుతున్న ఆన్లైన్ గేమింగ్ మోసాలు మరియు దానితో నష్టపోతున్న వారిని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త యాక్షన్ ప్లాన్ సిధ్దం చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కొత్త చర్యను అమల్లోకి తీసుకురావడానికి కేంద్రం సహాయం కోరినట్లు కూడా తెలుస్తోంది. అయితే, ఇది రియల్ మనీ గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ కోసం తీసుకున్న నిర్ణయం గా కూడా చెబుతోంది.
రియల్ మనీ గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ పై బ్యాన్ విధించడానికి మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, యోచిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ప్రజలు పూర్తిగా ఈ రియల్ మనీ గేమింగ్ కి బానిసలుగా మారిన వారు, అప్పుల పాలవ్వడం, ఆస్థి కోల్పోవడం మొదలు వారి మానసిక స్థితిలో జరిగే అనేక ఘోరమైన మార్పులు దృష్టిలో ఉంచుకుని, ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.
అయితే, ఈ బ్యాన్ కేవలం ప్రజల ఫైనాన్షియల్ లైఫ్ ను ఎఫక్ట్ చేసే రియల్ మనీ గేమింగ్ కోసం తీసుకుంటుంది. అంటే, ప్రజల ఫైనాన్షియల్ లైఫ్ పై నేరుగా చర్య చూపే రియల్ మనీ గేమింగ్ పై ఫోకస్ చేయడానికి ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే, ఈ బ్యాన్ కేవలం రియల్ మనీ గేమింగ్ మరియు రియల్ మనీ యాప్స్ కోసం మాత్రమే. సాధారణ ఆన్లైన్ గేమింగ్ కోసం ఎటువంటి బ్యాన్ ను వర్తింప చేయదని కూడా చెబుతున్నారు. అంటే, ఈ చర్య వల్ల సాధారణ ఆన్లైన్ గేమింగ్ కు ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు. కానీ, వీటిలో కూడా కొంత మార్పులు చేసే అవకాశం ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
Also Read: మృతుల Aadhar Card ను ఆన్లైన్ లో తొలగించే అవకాశం ఫ్యామిలీ సభ్యులకు ఉంటుందా?
రియల్ మనీ గేమింగ్ కి బానిసై మూడు ఎకరాల పొలం, ఇల్లు అమ్మడమే కాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయి, అవి తీర్చలేక రెండు సంవత్సరాల కొడుకు, కడుపుతో ఉన్న భార్యను కడతేర్చి తాను కూడా జీవితాన్ని చాలించాడు. ఈ విషయాన్ని సిరీస్ గా తీసుకున్న శివసేన MLA కైలాష్ పాటిల్, ఈ విషయాన్ని ముందుగా అసెంబ్లీలో లేవనెత్తారు. MLAs అందరు కూడా ముక్త కంఠంతో ఆమోదం తెలిపారు. ఈ అందరి నిర్ణయానికి ఆమోదం తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ విషయాన్ని సెంటర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు.
అయితే, రియల్ మనీ గేమింగ్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న చర్యలు ఏమిటో అధికారికంగా తెలియాల్సి ఉంది.