భారతీయ మొబైల్ సంస్థ తయారు చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చేస్తున్నవారికి గుడ్ న్యూస్. భారతీయ మొబైల్ సంస్థ LAVA తన కొత్త Lava X2 స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో ప్రకటించింది. ఈ లావా బడ్జెట్ ఫోన్ బడ్జెట్ వినియోగధారులను ఆకర్షించే పెద్ద స్క్రీన్, పెద్ద బ్యాటరీ మరియు డ్యూయల్ రియర్ కెమెరా వంటి మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. లావా ఇటీవల మార్కెట్లో ప్రవేశపట్టిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఈ అఫర్ ధరతో లభిస్తోంది. అందుకే, ఈ లావా కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం.
అమెజాన్ ఇండియా నుండి Lava X2 స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం Pre-Booking కోసం అంధుబాటులో వుంది మరియు మార్చ్ 11వ తేదీ లోపుగా బుక్ చేసుకునే వారికి రూ.6,599 రూపాయల అఫర్ ధరకే లభిస్తుంది. అఫర్ ముగిసిన తర్వాత ఈ ఫోన్ రూ.6,999 ధరతో రిటైల్ చేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లావా ఇ-స్టోర్ ద్వారా కూడా రీటైలింగ్ చేయబడుతుంది.
లావా ఎక్స్2 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అయితే, ప్రోసెసర్ పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 2GB ర్యామ్ తో వస్తుంది మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వుంది.
ఈ ఫోన్ వెనుక 8MP మైన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ కలిగివుంది. ఈ ఫోన్ AI-ఆధారిత మెరుగుదలలతో వస్తుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 5MP సెల్ఫీ కెమెరాను కలిగివుంది. ఈ లావా ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీ మరియు సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఇతర కనెక్టివిటీ ఎంపికలు విషయానికి వస్తే, WiFi, బ్లూటూత్ 5.0, డ్యూయల్ 4G SIM సపోర్ట్, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ మరియు OTG సపోర్ట్ ఉన్నాయి.