Lava X2: బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చిన భారతీయ మొబైల్

Updated on 04-Mar-2022
HIGHLIGHTS

LAVA మార్కెట్లోకి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది

Lava X2 పేరుతో ఇండియన్ మార్కెట్లోకి విడుదల

లావా ఎక్స్2 పెద్ద బ్యాటరీ, డ్యూయల్ కెమెరా వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది

ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ సంస్థ LAVA మార్కెట్లోకి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. Lava X2 పేరుతో ఇండియన్ మార్కెట్లోకి  విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద స్క్రీన్, పెద్ద బ్యాటరీ మరియు డ్యూయల్ రియర్ కెమెరా వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. భారతీయ బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని వారికి అవసరమైన స్పెక్స్ తో ఈ ఫోన్ ను అందించింది. లావా కొత్తగా ప్రకటించిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి వివరాలను చూద్దాం.

Lava X2: ధర & సేల్

అమెజాన్ ఇండియా నుండి Lava X2 స్మార్ట్ ఫోన్  ప్రస్తుతం Pre-Booking కోసం అంధుబాటులో వుంది మరియు మార్చ్ 11వ తేదీ లోపుగా బుక్ చేసుకునే వారికి రూ.6,599 రూపాయల అఫర్ ధరకే లభిస్తుంది. అఫర్ ముగిసిన తర్వాత ఈ ఫోన్ రూ.6,999 ధరతో రిటైల్ చేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లావా ఇ-స్టోర్ ద్వారా కూడా రీటైలింగ్ చేయబడుతుంది.

Lava X2: ప్రత్యేకతలు

లావా ఎక్స్2 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అయితే, ప్రోసెసర్ పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 2GB ర్యామ్ తో వస్తుంది మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వుంది.

ఈ ఫోన్ వెనుక 8MP మైన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ కలిగివుంది. ఈ ఫోన్ AI-ఆధారిత మెరుగుదలలతో వస్తుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 5MP సెల్ఫీ కెమెరాను కలిగివుంది.  ఈ లావా ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీ మరియు సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఇతర కనెక్టివిటీ ఎంపికలు విషయానికి వస్తే, WiFi, బ్లూటూత్ 5.0, డ్యూయల్ 4G SIM సపోర్ట్, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ మరియు OTG సపోర్ట్ ఉన్నాయి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :