OTT లో వచ్చిన ఈ కొత్త సినిమాలను చూశారా!!

Updated on 15-Jun-2022
HIGHLIGHTS

OTT పైన నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్

కొత్తగా వచ్చిన తెలుగు సినిమాలు

ఏ OTT ప్లాట్ ఫామ్ పైన స్ట్రీమ్ అవుతున్నాయో తెలుసా

గత శుక్రవారం తో పాటుగా నిన్నటి వరకు OTT పైన డబ్బింగ్ సినిమాలతో కలిపి నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. OTT లో రిలీజైన తెలుగు కొత్త సినిమాల కోసం చూస్తున్నట్లయితే, ఈ నాలుగు సినిమాలను చూడవచ్చు. కొత్తగా వచ్చిన తెలుగు సినిమాలలో కాలేజ్ డాన్, కిన్నెరసాన్ని, జయమ్మ పంచాయతీ ఉండగా, వీటితో పాటుగా మలయాళం నుండి తెలుగులోకి డబ్ చేయబడిన CBI 5: The Brain సినిమా ఉన్నాయి. ఈ లేటెస్ట్ సినిమాలు ఏ OTT ప్లాట్ ఫామ్ పైన స్ట్రీమ్ అవుతున్నాయో తెలుసుకుందామా.

కాలేజ్ డాన్

కాలేజ్ డాన్ మూవీ మే 13 న థియేటర్లలో విడుదలై తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. శివ కార్తికేయన్ మరియు అరుల్ మోహన్ హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం వినోదాత్మకంగా సాగిపోతుంది. కాలేజ్ చుట్టూ తిరగే ఈ కథ పాతదే అయినా కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా జూన్ 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతొంది.

కిన్నెరసాన్ని

రమణ తేజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన కిన్నెరసాన్ని కూడా గత శుక్రవారం OTT లో రిలీజ్ అయ్యింది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాన్ని ముందుగా థియేటర్లలో విడుదల చెయ్యాలని అనుకున్నా, దీనికి ముందుగా వచ్చిన సూపర్ మచ్చి సినిమా ఫలితాలను దృష్టిలో ఉంచుకొని, ఈ సినిమాని Zee5 లో డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. జూన్ 10 నుండి కిన్నెరసాన్ని Zee5  నుండి స్ట్రీమ్ అవుతోంది.

జయమ్మ పంచాయతీ

బలగ ప్రకాశ్ నిర్మాతగా కలివరపు విజయ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ హై డ్రామా మూవీ పలువురి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా, సుమ కనకాల నటన ఈ చిత్రానికి ప్రాణం పోసినట్లు పలువురు ప్రముఖులు కితాబు పలికారు. ఈ సినిమాలో దినేష్ మరియు షాలినీ హీరో హీరోయిన్లుగా నటించారు. సినిమా పేరుకు తగ్గట్టుగానే కథ మొత్తంగా గ్రామీణ వాతావరణంలోనే సాగుతుండడమే కాకుండా కావాల్సినంత కామెడీ మరియు డ్రామా ఈ సినిమాలో చూడవచ్చు. 'జయమ్మ పంచాయతీ' మూవీ జూన్ 14 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో నుండి స్ట్రీమ్ అవుతోంది.

CBI 5: The Brain

K. మధు దర్శకత్వంలో వచ్చిన మిస్టరీ త్రిల్లర్ మలయాళీ మూవీ CBI 5: The Brain సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమ్ అవుతోంది. సహజ నటుడు మమ్ముట్టీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 12 నుండి నేట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమ్ అవుతోంది. ఇందులో అత్యంత కఠినమైన కేస్ ను ఇన్వెస్టిగేట్ చేసే సీనియర్ CBI ఆఫీసర్ పాత్రలో  మమ్ముట్టి నటించారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :