మొదటిసారిగా ట్యాబ్లేట్ తీసుకువస్తున్న ViVO…ఫీచర్లు కూడా అదుర్స్..!

Updated on 03-Dec-2021
HIGHLIGHTS

వివో ట్యాబ్ SD 870 తో వస్తున్నట్లు లీక్స్

బ్లేజింగ్ స్పీడ్ ప్రొసెసర్

అతిభారీ 8040mAh బ్యాటరీతో వస్తుంది

ViVO మొదటిసారిగా ట్యాబ్లేట్ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. వాస్తావనికి, ఈ సంవత్సరం ఆరంభం లోనే వివో సంస్థ యూరోపియన్ యూనియన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ (EUIPO)తో Vivo Pad ని ట్రేడ్ మార్క్ చేసింది. అంతేకాదు, కంపెనీ దృవీకరించినట్లుగా 2022 సంవత్సరం అర్ధభాగంలో ఈ వివో ట్యాబ్లేట్ మార్కెట్లో అడుగుపెడుతుంది. అయితే, ఇప్పటి వరకూ ఈ ట్యాబ్ గురించి ఎటువంటి వివరాలు తెలియనప్పటికీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక లీక్ ఈ టాబ్లెట్ Qualcomm చిప్‌సెట్ శక్తితో పనిచేస్తుందని చెబుతోంది.

Vivo Pad: స్పెక్స్

ఈ అప్ కమింగ్ వివో ట్యాబ్లేట్ గురించి ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ స్టేషన్ కొన్ని వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, అప్ కమింగ్ వివో ట్యాబ్లేట్ Snapdragon 870 ప్రోసెసర్ తో వస్తుందని వెల్లడించింది. ఈ ప్రోసెసర్ తో X60 ప్రో మరియు iQOO 7 వంటి కొన్ని ప్రీమియం స్మార్ట్ ఫోన్లను ఇప్పటికే వివో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇదే కనుక నిజమైతే వివో ట్యాబ్లేట్ చాల వేగంగా పని చెయ్యగలదని ఖచ్చితంగా చెప్పొచ్చు.

మరిన్ని లీక్డ్ వివరాల్లోకి వెళితే, ఈ అప్ కమింగ్ వివో ట్యాబ్లేట్ TUV Rheinland సర్టిఫికేషన్ వెబ్సైట్ లో కూడా కనిపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, 8040mAh హెవీ బ్యాటరీని కూడా కలిగి ఉన్నట్లు వెల్లడించింది.  

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :