మీ 4G స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ మరింత వేగంగా ఇలా మార్చుకోండి.!

HIGHLIGHTS

ఇంటర్నెట్ స్పీడ్ మరింత వేగంగా మార్చుకోవడానికి సహాయపడే బెస్ట్ టిప్స్

వేగంతమైన ఇంటర్నెట్ ను మీరు ఆనందించవచ్చు

మీకు సహాయపడే ఐదు బెస్ట్ టిప్స్ ఇక్కడ చూడవచ్చు

మీ 4G స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ మరింతగా వేగంగా మార్చుకోవడానికి సహాయపడే బెస్ట్ టిప్స్ గురించి ఈరోజు చుడనున్నాము. ఈ టిప్స్ ద్వారా మీ 4G స్మార్ట్ ఫోన్ లో మరింత వేగంతమైన ఇంటర్నెట్ ను మీరు ఆనందించవచ్చు. దీనికోసమే, మీ 4G మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని మరింతగా పెంచేందుకు మీకు సహాయపడే ఐదు బెస్ట్ టిప్స్ ఇక్కడ అందిస్తున్నాను.

1. ఫోన్‌ను Re-Start చెయ్యండి

ఇది మొదటి మరియు సులభమైన మార్గం. మీ ఫోన్‌ను పునఃప్రారంభించిన (Re-Start) తరువాత, మొబైల్ నెట్‌వర్క్ సెర్చ్ చేస్తుంది. కాబట్టి, మొబైల్ ఇంటర్నెట్ వేగం చాలా రెట్లు పెరుగుతుంది. ఈ మార్గంతో పాటు మీరు మొబైల్ డేటాను ఒకసారి ఆపివేసి పునఃప్రారంభించవచ్చు.

2. ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేయండి

మొబైల్‌ను పునఃప్రారంభించడంతో పాటు, మీరు మీ ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్‌ను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు. ఆ విధానంలో కూడా మీ ఫోన్ మళ్ళీ మొబైల్ నెట్‌వర్క్‌ను Search చేస్తుంది కాబట్టి, ఇది ఫోన్ యొక్క ఇంటర్నెట్ వేగాన్ని చాలాసార్లు పెంచుతుంది.

3. డేటా వినియోగాన్ని తనిఖీ చేయండి

చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా రోజువారీ డేటా పరిమితితో వస్తాయి. ప్లాన్ యొక్క డేటా పరిమితి గడువు ముగిసిన తరువాత, ఇంటర్నెట్ వేగం ఆటొమ్యాటిగ్గా  తగ్గుతుంది. ఈ సందర్భంలో, మీరు మీ డేటా వినియోగాన్ని ఒకసారి పరిశీలించడం మంచిది.

4. ఆటో డౌన్‌లోడ్ Update నిలిపివేయండి

సాధారణంగా యాప్స్ ను అప్డేట్ చేయ్యుడానికి  ఫోన్‌లో ఆటో డౌన్‌లోడ్ ఎంపిక ఆన్ చేయబడుతుంది. మీరు ఈ ఎంపికను ఆపివేయగలిగితే బాగుంటుంది. ఈ విధానంలో మీకు పరిమిత ఇంటర్నెట్ వినియోగం ఉంటుంది మరియు దీని తరువాత మీకు మంచి వేగం లభిస్తుంది.

5. ఫోన్ యొక్క నెట్‌వర్క్ సెట్టింగ్‌లను Reset చేయండి

మీ ఫోన్ యొక్క సెట్టింగులను మార్చినప్పటికీ చాలా సార్లు ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. అలాంటప్పుడు, మీ ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను ఒకసారి Reset చేయడం మంచిది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :