OTT లో స్ట్రీమ్ అవుతున్న ఈ కొత్త సినిమాలను చూశారా..!!

Updated on 11-May-2022
HIGHLIGHTS

OTT ప్లాట్ ఫామ్స్ మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి

OTT ప్లాట్ ఫామ్స్ పైన చాలా తొందరగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి

ఈ నెలలో వచ్చిన ఈ లేటెస్ట్ సినిమాలు చూశారా?

ప్రస్తుతం రెగ్యులర్ ఛానల్స్ కంటే OTT ప్లాట్ ఫామ్స్ మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి. కొత్త సినిమాలు వరుసగా OTT  ప్లాట్ ఫామ్స్ పైన చాలా తొందరగా రిలీజ్ కావడం ప్రధానమైన రీజన్ గా చెప్పొచ్చు. కేవలం ఏప్రిల్ నెలలలోనే ఇప్పటి వరకూ అనేకమైన లేటెస్ట్ సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రిలీజ్ అయ్యాయి. అంతేకాదు, ఈ నెల చివరి వరకూ మరిన్ని కొత్త సినిమాలు రిలీజ్ కావడానికి క్యూ లో వున్నాయి. మరి ఈ నెలలో వచ్చిన ఈ లేటెస్ట్ సినిమాలు చూశారా? ఒకవేళ చూడక పోయినట్లయితే, ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏ ఏ కొత్త సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయో చూద్దాం.

గని

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వచ్చిన వరుణ్ తేజ్ సినిమా గని ధియేటర్స్ వద్ద ఆశించినంత రాణించలేక పోయింది. అయితే, వరుణ్ తేజ్, ఉపేంద్ర మరియు సునీల్ శెట్టి తో పాటు జగపతిబాబు అద్భుతమైన యాక్టింగ్ ఈ సినిమాలో చూడవచ్చు. ఏప్రిల్ 8 న సినిమా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఏప్రిల్ 22 నుండి AHA లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా అద్భుతమైన నటన కనబరిచినట్లు కితాబు అందుకున్నాడు.                  

ఆడవాళ్ళు మీకు జోహార్లు

సినిమా థియేటర్లలో మార్చ్ 4న రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా IMDb లో 6.5 రేటింగ్ తో యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో శర్వానంద్, రష్మికా మందన్న, ఖుష్బూ మరియు రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. కామెడీ, సెంటిమెంట్ మరియు బంధాలకు ప్రాధాన్యతనిస్తూ తీసుకొచ్చిన ఈ సినిమా ఆడవారిని అధికంగా ఆకర్షిస్తుంది. ఈ సినిమా SonyLiv OTT ప్లాట్ ఫామ్ నుండి స్ట్రీమ్ అవుతోంది.

జేమ్స్

దివంగత కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరిగా నటించిన చిత్రం జేమ్స్ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధించింది. ఈ కన్నడ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏప్రిల్ 14న SonyLiv నుండి స్ట్రీమ్ అవుతోంది. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ జేమ్స్ మూవీ ఒక సెక్యూరిటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న సంతోష్ కుమార్ కథను చెబుతుంది. ఈ సినిమాలో మాదకద్రవ్యాల వ్యాపారంలో చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించే బాధ్యత హీరోది. ఆ తరువాత ఏం జరిగిందన్నది సినిమా.   

స్టాండ్ అప్ రాహుల్

రాజ్ తరుణ్ హీరోగా నటించిన స్టాండ్ అప్ OTT స్ట్రీమ్ అవుతోంది. AHA నుండి ఈ సినిమా 8 ఏప్రిల్ నుండి స్ట్రీమ్ అవుతోంది. ఇది జీవితంలో ఎవరికి కోసం ఎప్పుడూ నిలబడని ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరిన తరువాత ప్రేమలో పడి జీవితంలో ప్రతి విషయంలో నిలబడాలని నేర్చుకుంటాడు. ఇది ఒక రొమాన్స్ కామెడీ సినిమా మరియు ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరో ఇన్ గా నటించగా ఇంద్రజ, వెన్నెల కిశోర్ మరియు మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.           

ET (ఎతరక్కుమ్ తునిందవన్)

సూర్య నటించిన సూపర్ యాక్షన్ మూవీ ET ఈరోజు Netflix మరియు Sun Next రెండు ప్లాట్ ఫామ్స్ నుండి స్ట్రీమ్ అవుతోంది. తమిళంలో ET (ఎతరక్కుమ్ తునిందవన్) మరియు తెలుగులో ET (ఎవరికి తలవంచడు) పేరుతో వచ్చిన సూర్య యాక్షన్ మూవీ ఈరోజు నుండి OTT లో స్ట్రీమ్ అవుతోంది. పక్కా మాస్ మసాలా మరియు జబర్దస్త్ యాక్షన్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, మార్చి 10 న ప్రంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 175 కోట్ల వరల్డ్ వైడ్ కలక్షన్ సాధించినట్లు చెబుతున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :