లేటెస్ట్ గా విడుదలైన 1.5 Ton Split AC ని ఈరోజు మంచి డిస్కౌంట్ తో కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే అవకాశం వుంది. ఈ ఆఫర్ అమెజాన్ ఇండియా నుంచి అందుబాటులో ఉంది. ఈ స్ప్లిట్ ఏసీ రీసెంట్ గా విడుదలైన 2025 మోడల్ మరియు 5-In-1 కన్వర్టబుల్ కూలింగ్ మోడ్ ఫీచర్ మరియు Ai సెన్స్ టెక్నాలజీ వంటి మరిన్ని ఫీచర్స్ ఉంటాయి. 30 వేల బడ్జెట్ ధరలో కొత్త ఏసీ కోసం చూస్తున్న వారు పరిశీలించ తగిన డీల్స్ లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా 1.5 Ton Split AC డీల్?
2025 లో Acer రీసెంట్ గా విడుదల చేసిన 1.5 టన్ ఏసీ మోడల్ నెంబర్ (AR15AS3IS1HLE25) పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. అమెజాన్ ఈరోజు ఏసీని 30% డిస్కౌంట్ తో రూ. 31,999 రూపాయల ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఏసీని HDFC క్రెడిట్ కార్డుని ఉపయోగించి 12 నెలల EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,500 భారీ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ ఏసర్ స్ప్లిట్ ఏసీ 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఈ ఏసీ పై 2 సంవత్సరాల ప్రోడక్ట్ వారెంటీ మరియు కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఏసర్ ఏసీ 5-In-1 కన్వర్టబుల్ కూలింగ్ మోడ్ ఫీచర్ తో వస్తుంది. అంతేకాదు, డస్ట్ ఫిల్టర్ మరియు Ai సెన్స్ టెక్నాలజీ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఏసర్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఆటో ఎర్రర్ చెక్, ఆటో సెల్ఫ్ క్లీన్ మరియు 3D కూలింగ్ వంటి మరిన్ని ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఏసీ 55 డిగ్రీల టెంపరేచర్ వాతావరణం లో కూడా పని పని చేస్తుందని ఏసర్ తెలిపింది. ఈ ఏసీ 100% కాపర్ కాయిల్ మరియు రస్ట్ అంటుకొని బ్లూ ఫిన్ మరియు స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అందిస్తుంది.