చాలా కాలంగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా KGF చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి భారీ కలక్షన్స్ వసూలు చేస్తోంది. రాకింగ్ స్టార్ యష్ యాక్షన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 10,000 వేలకు పైగా స్క్రీన్స్ పైన ప్రదర్శించబదిండి. అంతేకాదు, ఈ KGF చాప్టర్ 2 సినిమా చూసేవారికి మరొక షాకింగ్ మరియు సర్ప్రైజింగ్ న్యూస్ అందించారు. కెజిఎఫ్ సినిమా చివర్లో, మూడవ భాగం గురించి ఈ సినిమా గురించి మేకర్లు ప్రేక్షకులకు సూచించారు. ఈ న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక KGF చాప్టర్ 2 OTT రిలీజ్ విషయానికి వస్తే, ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా వస్తుంది. అయితే, ఇప్పటి వరకూ ఈ సినిమా యొక్క OTT రిలీజ్ డేట్ గురించి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన కూడా వెల్లడించలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో KGF చాప్టర్ 2 సినిమా కోసం భారీ అమౌంట్ ను అఫర్ చేసినట్టు కూడా నెట్టింట్లో పుకార్లు ఉన్నాయి.
వాస్తవానికి, ఈ సంవత్సరం ప్రజలు అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాలలో KGF చాప్టర్ 2 ఒకటి. అంతేకాదు, విడుదలైన ప్రతి దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంది మరియు ఈ చిత్రం ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందనతో KGF చాప్టర్ 1 యొక్క రికార్డ్ బద్దలు కొట్టి, కొత్త రికార్డ్ సృష్టించింది. చిత్ర యూనిట్ ఈ సినిమా చివర్లో అందించిన KGF చాప్టర్ 3 గురించి ఇచ్చిన హింట్ తో ఫ్యాన్స్ ఆనందం ఆకాశాన్నంటింది.
ఇదే నిజమైతే, ఇప్పటి వరకూ KGF చాప్టర్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూసిన ప్రజలు, ఇప్పుడు KGF చాప్టర్ 3 కోసం మళ్ళి ఎదురుచూడాల్సి వస్తుంది. అంటే, యష్ అకా రాకీ భాయ్ ముచ్చటగా మూడవసారి తన యాక్షన్ తో మెరిపించనున్నాడు. ఈ విషయాన్ని థియేటర్లలో వెల్లడించి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయడమే కాకుండా, మేకర్స్ ప్రజల దృష్టిని ఖచ్చితంగా ఆకర్షించారు. అంతేకాదు, KGF ఎక్కడికీ వెళ్లదని కూడా గుర్తు చెయ్యడమే కాకుండా రాకీ భాయ్ కథ ఇంకా కొనసాగుతుందని మరియు మరింత బలంతో తిరిగి వస్తుందని కూడా చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తోంది.