మరో రెండు రోజుల్లో కమల్ హసన్ 'విక్రమ్' OTT రిలీజ్ కాబోతోంది. కమల్ హాసన్ మూడేళ్ల తర్వాత విక్రమ్ సినిమాతో వెండితెరపై మళ్ళి కనిపించారు. అదీకూడా, హై వోల్టాజ్ యాక్షన్ మూవీ తో రావడంతో బక్సాఫిస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. జూన్ 3 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, విడుదలైన అన్ని భాషల్లో కూడా బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం జూలై 8న OTT లో రిలీజ్ అవుతోంది.
కమల్ హాసన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 'విక్రమ్' జూలై 8 మధ్యాహ్నం 12 గంటలకు డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ OTT రిలీజ్ మరియు స్ట్రీమింగ్ తేదీని చిత్ర నిర్మాతలు మరియు డిస్నీ+ హాట్‌స్టార్ వెల్లడించారు.
ఈ సినిమాలో ముఖ్య పాత్రలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కూడా నటించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ రిటైర్డ్ పోలీస్ పాత్రలో నటించారు. ఈ సినిమా విమర్శకుల నుండి కూడా మంచి టాక్ తెచ్చుకుంది. టోటల్ గా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు OTT లో సందడి చేయబోతోంది.