జోకర్ మాల్వేర్ విజృంభిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ Kaspersky యొక్క విశ్లేషకుడు తత్యాన సిస్కోవా గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న కొన్ని యాప్స్ జోకర్ మాల్వేర్ భారిన పడినట్లు పేర్కొన్నారు. ఇది శక్తివంతమైన మాల్వేర్ మరియు ముందుగా గూగుల్ దీన్ని పూర్తిగా తొలగించడానికి తగిన చర్యలు కూడా తీసుకుంది. అయితే, తత్యాన సిస్కోవా లేటెస్ట్ గా జోకర్ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్ లోకి తిరిగి ప్రవేశించినట్లు, దాదాపుగా 15 యాప్స్ దీని భారిన పడినట్లు తెలిపారు.
గత సంవత్సరం గూగుల్ ప్లే స్టోర్ నుండి అనేకమైన యాప్స్ పైన జోకర్ మాల్వేర్ అటాక్ చేసింది. దీనిభారీ నుండి వినియోగదారులను రక్షించడానికి గూగుల్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోని ఈ మాల్వేర్ సోకిన అన్ని యాప్స్ ను తొలగించింది. అయితే, ఈ మాల్వేర్ మళ్ళి గూగుల్ ప్లే స్టోర్ లోకి తిరిగి వచ్చినట్లు కనిపిస్తోంది.
జోకర్ మాల్వేర్ అనేది మీకు తెలియకుండానే మీ ఫోన్ నుండి ఆన్లైన్ యాడ్స్ మరియు ఆన్లైన్ సర్వీస్ లకు సబ్ స్క్రిప్షన్ ను యాక్సెస్ చేస్తుంది. అంటే, మీకు తెలియకుండానే మీరు తీసుకోని సర్వీస్ లకు మీరు డబ్బు చెల్లిస్తారు. అంటే, ఈ మాల్వేర్ మిమల్ని జోకర్ చేస్తుంది. ఇది ఎంత ప్రమాదకరమైన మాల్వేర్ అంటే, చెల్లింపులను రహస్యంగా ఆమోదించడానికి SMS నుండి OTP లను కూడా యాక్సెస్ చేయగలదు. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను చూసుకునే వరకూ మీకు ఈ విషయం గురించి తెలియదు.