రేపటితో ముగియనున్న Jio ఛాలంజ్ అఫర్ : ఉచిత ఫారెన్ ట్రిప్ మిస్సవ్వకండి

Updated on 03-Feb-2020

తన వినియోగదారుల టాలెంట్ ని బయటకి తియ్యడానికి,  జియో ప్రకటించిన Jio's Got Talent ఛాలంజ్ రేపటితో ముగియనుంది. జియో మరియు స్నాప్‌చాట్ నుండి, మీకు ఈ గొప్ప అవకాశం ఇవ్వబడుతుంది. ఈ రెండు సంస్థలు భాగస్వామ్యంగా ఈ వినూత్న చాలంజ్ పోటీని తీసుకొచ్చాయి. ఇది భిన్నమైన మరియు ప్రత్యేకమైనది మాత్రమే కాకుండా,  గొప్ప బహుమతులను  గెలుచుకోవడానికి వినియోగదారులకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది.

ఈ ఛాలంజ్  చాలా సింపుల్ మరియు ఉచితం. ఇందులో,  మీరు 10 సెకన్ల వీడియోను మాత్రమే రికార్డ్ చేయాలి మరియు ఈ వీడియోలో మీ టాలెంట్ చూపించాలి. ఈ ఛాలంజ్ హంట్ కోసం ప్లాట్‌ ఫామ్‌లో లైవ్ గా టాలెంట్ ఫిల్టర్ చూపిస్తుంది. ఈ కొత్త ఫిల్టర్ ద్వారా, వినియోగదారులకు వీడియోను క్రియేట్ చేసే అవకాశం ఉంది, ఈ వీడియోతో పాటు మీరు స్నాప్‌ చాట్ లెన్స్ ద్వారా టోపీలు, హెడ్‌ఫోన్లు, లైట్ రింగులు మరియు మైక్  వంటి AR ప్రొఫైల్లను తయారు చేయవచ్చు.

ఈ కొత్త ఛాలెంజ్ ద్వారా, టిక్ టాక్  మరియు ఇన్‌స్టాగ్రామ్‌ ల మాదిరిగానే స్నాప్‌చాట్‌ లో కొత్త దశను ప్రారంభించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో పాల్గొనడానికి ఇష్టపడే ఎవరైనా ఈ పోటీ కోసం సైన్ అప్ చేయవచ్చు. రిలయన్స్ మరియు స్నాప్‌చాట్ వీడియో క్యాప్షన్‌ లో పాల్గొనేవారు తప్పనిసరిగా స్నాప్‌కోడ్ లేదా వినియోగదారు పేరును కలిగి ఉండాలి. 10 సెకన్ల నిడివి గల వీడియోను స్నాప్‌చాట్ యొక్క "Our Story" కి జతచేయాల్సి ఉంటుంది, తద్వారా ఇది అందరూ చూడడానికి వీలుగా ఓపెన్ గా ఉంటుంది.

ఈ టాలెంట్ హంట్‌ లో పాల్గొనడానికి, మీకు స్నాప్‌చాట్ ఖాతా ఉండాలి. ఇందులో  jio's got talant కోసం మీరు స్నాప్ ఐడిని క్లిక్ చేయవచ్చు లేదా స్కాన్ చేసి, ఆపై మీ 10 సెకన్ల వీడియోను రికార్డ్ చేయడం ప్రారంభించడానికి కొత్త లెన్స్ లేదా ఫిల్టర్‌ ను అన్‌లాక్ చేయవచ్చు. క్యాప్షన్‌కు స్నాప్ ఐడి లేదా యూజర్‌నేమ్‌ను జోడించడం మర్చిపోవద్దు మరియు వీడియోను "our Story " కి అప్‌లోడ్ చేయండి.

జియో యొక్క ఈ టాలెంట్‌ ఛాలంజ్ లో భాగం కావడం ఉచితం.ఇక ఈ ఇందులో మొదటి అవార్డు గ్రహీతకు థాయిలాండ్ (ఇద్దరి కోసం) ఉచిత యాత్రను ప్రకటించగా, మిగతా ఇద్దరు రన్నరప్‌లకు రిలయన్స్ జియో నుండి రీఛార్జ్ లభిస్తుంది. ఈ ఛాలంజ్,  ఇప్పటికే Live గా ఉందని గమనించాలి మరియు పాల్గొనేవారు తమ ఎంట్రీలను అప్‌లోడ్ చేయడానికి ఫిబ్రవరి 4 ఆఖరి తేదీ అని గుర్తుంచుకోండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :