జియో బంపర్ ఆఫర్: సంవత్సరం మొత్తం ఆనందించండి

Updated on 22-Sep-2020
HIGHLIGHTS

జియో యొక్క లేటెస్ట్ 1 సంవత్సరం ఆఫర్లు

రూ. 2399 మరియు రూ .2599 ఆఫర్లు

వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటాను అందుకుంటారు

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ఎప్పటికప్పుడు మంచి ఆఫర్లను అంధిస్తుంది. అయితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా రూ .2599 ప్లాన్ గురించి చెప్పొచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2599 రూపాయల దరలో వస్తుంది మరియు యిజర్లకు డైలీ  2GB హై స్పీడ్ డేటాతో పాటుగా 10GB అధనపు డేటాని కూడా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ద్వారా, జియో నుండి జియో నెట్వర్క్ కి అన్లిమిటెడ్ కాలింగ్, ఇతర నెట్ ‌వర్క్ కోసం కాల్ చేయడానికి యూజర్లు 12000 నిమిషాలు మరియు పూర్తిగా ఒక సంవత్సరం చెల్లుబాటుతో వస్తుంది.

ఇతర బెస్ట్ జియో ఆఫర్లను చూడండి

రూ .2399 రీఛార్జ్ కూడా ఉత్తమైన ప్రీపెయిడ్ ప్లానుగా చెప్పవచ్చు, ఇది వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటాని అందిస్తుంది. ఈ ప్లాన్, ఒక సంవత్సరం అంటే 365 రోజుల వ్యాలిడితో వస్తుంది కాబట్టి, రోజుకు 2GB డేటా చొప్పున 365 రోజులకు గాను వినియోగదారులలు మొత్తంగా 730GB డేటాను పొందుతారు.

అదనంగా, జియో కస్టమర్లకు రూ .2,399 రీఛార్జ్ పైన ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇందులో, వినియోగదారులకు జియో నుండి జియోకు అపరిమిత కాల్ ప్రయోజనం మరియు జియో నుండి ఇతర నెట్వర్క్ కాలింగ్ కోసం 12,000 నిమిషాల కాలింగ్ వరకు లభిస్తుంది. అధనంగా, వినియోగదారులు రోజుకు 100 SMS  మరియు జియో యొక్క కాంప్లిమెంటరీ చందాలను కూడా అందుకుంటారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :